Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు దీక్షకు దిగిన ఘటన మండల పరిధిలోని బర్లగూడెం గ్రామం పరిధిలోని నాయక్ తండాలో శుక్రవారం జరిగింది. ఓకే గ్రామానికి చెందిన నునావత్ పరోషన్, భుక్యా సురేష్ ఇరువురు బిటెక్ చదువుకుంటూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించు కున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఉద్యోగం వచ్చిన తరువాత తనను వదిలేసి వేరే వారితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడంతో సమాచారం తెలుసుకున్న ప్రియురాలు ప్రియుడు ఇంటి ముందు దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా పరోషన్ మాట్లాడుతూ సురేష్ గత ఎనిమిది సంవత్సరాలుగా తనను వాడుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. రైల్వేలో ఉద్యోగం రావడంతో కట్నం ఎక్కువ ఎవ్వలేరనే ఉద్దేశంతో తనను వదిలేసి వేరే వారితో సంబంధం కుదిరించుకోవటానికి సిద్ధం అయ్యాడని తనకు సమాచారం తెలియడంతో హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటున్న తాను వెంటనే వచ్చి దీక్షకు దిగటం జరిగిందన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ముందు నుంచి లేవనని ఆమె తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీక్షకు మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.