Authorization
Wed April 02, 2025 11:31:54 am
నవతెలంగాణ-మధిర
మధిర పట్టణంలోని కెవిఆర్ హాస్పిటల్లో శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మధిర మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మధిర కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.ధీరజ్ కుమార్ ఆదేశాల మేరకు న్యాయ చైతన్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్యపరమైన, న్యాయపరమైన విషయాల పట్ల రోగులకు కెవిఆర్ హాస్పిటల్ డాక్టర్ కె.రాంబాబు, న్యాయవాదులు గంధం శ్రీనివాసరావు, పుట్టా శ్రీనివాసరావులు అవగాహన కల్పించడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన ఆహార పదార్థాలను తినాలని చెప్పారు. కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ అధికారి సూర్యనారాయణ, మహిళా మండలి సభ్యురాలు సుజాత, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.