Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అభివృద్ధిని నిలువరేంచేందుకే సింగరేణి ప్రయివేటీకరణకు బీజేపీ కుట్ర
- సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
- కొత్తగూడెంలో నేడు సింగరేణి పరిరక్షణ మహా ధర్నా
- విలేకర్ల సమావేశంలో రేగా, తాతా మధు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలోనే అగ్రగామిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిలువరేంచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రయివేటీకరణకు పూనుకుంటుందని, తీన్ని అడుకునేందుకు చేయి చేయి కలుపుదామని, సింగరేణిని కాపాడు కుందామని, సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధులు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సింరగేణి పరిరక్షణకు కొత్తగూడెంలో 8వ తేదీ శనివారం సింగరేణి పరిరక్షణ మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొని విజయవంత చేయాలని కోరారు. స్థానిక పోస్టాఫీస్ సెంటర్ నుండి, బస్టాండ్ సెంటర్ వరకు జాతీయ రహదారిపై మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందిన్నారు. గత ఏడాది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి విచ్చేసిన దేశ ప్రధాని మోదీ చెప్పిన మాటలు సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోనని కళ్లబొల్లి మాటలు చెప్పిన తీరును గుర్తుచేశారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉందన్నారు. కేంద్రం తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బొగ్గు గని ప్రాంతాలలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదానీ లాంటి వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణ నూతన సంస్కరణల పేరిట సింగరేణిని నాశనం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సింగరేణి సంస్థని కాపాడు కోవాల్సిన భాద్యత కార్మికులదే కాదని, సంస్థమీద పరోక్షంగా ఆధార పడి జీవిస్తున్న వారందరిది అని చెప్పారు. సంస్థ ప్రయివేటి కరణ అనియే రిజర్వేషన్లు కనుమరుగు కాక తప్పదని, సామాన్య ప్రజానికానికి సింగరేణి అందిస్తున్న సామాజిక సేవ లేకుండా పోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టిజిబి కఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు బీఆర్ ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : తెలంగాణలో బొగ్గు బావులను ప్రయివేట్ సంస్థలకు వేలం పేరుతో అప్పగించేందుకు కేంద్ర నిర్ణయం పై నేడు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు అనంతరం రేగా విలేకరులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ నేడు జిల్లా ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టడం జరుగుతుందని ఈ ధర్నాకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మండలాల బాధ్యులు, అనుబంధ సంస్థలు, యువజన సంఘాలు, టీబీజీకేఎస్ సంఘ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావులు పాల్గొన్నారు.