Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హలో సీఆర్టీ...ఛలో ఐటీడీఏ భద్రాచలం
నవతెలంగాణ-లక్ష్మీదేవిపల్లి
గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హలో సిఆర్టీ, ఛలో ఐటీడీఏ భద్రాచలంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ అధ్యక్షతన లక్ష్మీదేవిపల్లిలో సిఆర్టి జిల్లా నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశాననికి ముఖ్య అతిధులుగా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల 12 నెలల వేతనం సాధించడం జరిగింది. అలాగే మిగిలిన 19 మంది సిఆర్టి మిత్రులకు అతి త్వరలో రెన్యూవల్ కావాలని కృషి చేస్తూన్నారన్నారు. పలుసమస్యల పరిష్కారం కోసం హాలో సిఆర్టి...ఛలో భద్రాచలం అనే నినాదంతో ఈనెల 14వ తేదీ శుకవారం భద్రాచలం ఐటిడిఏ వద్ద సభ ఏర్పాటు చేయడం జరిగిందని, దాన్ని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంనికి పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా నాయకులు హీరలాల్, మోతీలాల్, పీఆర్టి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్, నాయకులు రాజేష్, రూప్లా, బాబు రావు, లక్ష్మణ్, సురేష్, భావుసింగ్, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.