Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీస్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సిఫారసు లేఖల పరిష్కారంపై నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సిఫారసు చేసిన 56 లస్త్రఖలు పెండింగ్లో ఉన్నాయని ఆయా శాఖల అధికారులు బుధవారం వరకు పరిష్కరించి నివేదికలు అందజేయాలని అన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో చేసిన ధరఖాస్తులు కొన్ని సుజాతనగర్ మండలానికి చెందిన తొకచిచ్చు సీతరామరాజు సర్వే నెం.1497/ఈ/ఇ/2లో 2.90 ఎకరాల భూమి ఉన్నదని అట్టి భూమికి సంబంధించిన మాకు పూర్తి అధికారాలు ఉన్నాయని భూమి తక్కువగా ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయని సర్వే చేపించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు కొరకు సుజాతనగర్ తహసీల్ధార్కు ఎండార్స్ చేశారు. భూర్గంపాడు మండలానికి చెందని వంగూరి అరుణ, వంగూరి కామేశ్వరి డిగ్రీ వరకు చదువకున్నామని ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్నదని తమకు దళితబంధు పథకం మంజూరు చేపించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఎస్సీ కార్పొరేషన్ ఏడీకి ఎండార్స్ చేశారు. చుంచుపట్టి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన దామెర్ల వేణుమాధవ్ హైదరాబాద్ నందలి నల్లమల్లారెడ్డి గట్కేసర్ భూదరాబాద్ ఇంజనీరింగ్ ఎకక్ట్రికల్లో ఇంజనీరింగ్లో చేరానని కరోనా వల్ల తరగతులు నిర్వహణ సరిగా లేకపోవడం తెలుగు మీడియం నుండి వచ్చిన తాను ఇంగ్లీషు మీడియంలో విద్యను అభ్యసించలూకపోవడం వల్ల మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఇంజనీరింగ్ విద్య అభ్యసించలేనని తన సర్టిఫికేట్లు ఇప్పించాలని కొరగా మిగిలిన మూడు సంవత్సరాల ఫీజులు చెల్లించాలని చెప్పారని ఫీజులు చెల్లించలేని ఆర్ధిక పరిస్థితుల్లో ఉన్నామని తన సర్టిఫికేట్లు ఇప్పించాలని చేసిన ధరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్ ఒఎస్డీకి ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం మంచికంటినగర్కు చెందిన నూనావత్ శ్రీరాం మంచికంటినగర్ ముత్యాలమ్మ గుడి దగ్గర నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నానని విద్యుత్ నీటి సైకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కావునా విద్యుత్ నీటి సౌకర్యం కల్పించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. అన్నపురెడ్డి పల్లి మండలం తొల్లిపంపు గ్రామానికి చెందిన వసంతరావు మరికొంతరు గిరిజన రైతులు గత 20 సంవత్సరాలుగా ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో వ్యవసాయం సాగు చేస్తున్నామని నీటి సౌకర్యం కోసం సోలార్ ద్వారా బోర్లు వేసుకున్నామని అట్టి పట్టా కలిగిన భూముల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయుటకు ప్రభుత్వ రాయితీతో అయిల్ఫామ్ మొక్కలు ఇప్పంచాలని చేసిన ధరఖాస్తును తగు చర్యల నిమిత్తం ఉధ్యాన అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.