Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని ఆజాద్ నగర్, ఇంద్రానగర్ గ్రామం వరకు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధుల నుండి మంజూరైన రూ.కోటి 20 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఆజాద్ నగర్లోని 3 డీఎంఎఫ్ నిధులతో అంతర్గత సీసీ రోడ్లకు ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, వైస్ ఎంపీపీ ప్రమోద్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మెన్ మెట్ల కృష్ణ, ప్రభుత్వ ఉన్నత అధికారులు, సీడీపీఓ ప్రసన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హీరోలాల్, సెక్రెటరీ, నీలిమ రెడ్డి పాల్గొన్నారు.