Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ కబ్జాదారులు ఎవరో బహిరంగ చర్చకు సిద్ధం కావాలి
- ఖబర్దార్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
- విలేకరుల సమావేశంలో హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజా బలం ఉందని వాపును చూసి బలుపు అన్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు ప్రవర్తించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే హరిప్రియ విమర్శించారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూకబ్జాల పేరుతో దందాలు నడుస్తున్నాయని మాట్లాడుతున్న కోరం కనకయ్య భూకబ్జాల విషయంలో ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇల్లెందు గడ్డమీదికి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారాని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. సీఎం కేసీఆర్, బీఎస్ఆర్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఆనాడు సీఎం కేసీఆర్ను దేవుడు అని పొగిడి ఈరోజు గజిని అంటూ అపరిచితుడు లాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఓడిపోయిన కోరం కనకయ్యని జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిన సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్న కోరం కనకయ్య ఏమి ఆశించి మీరు పొంగులేటితో తిరుగుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లందు సమస్యల పట్ల ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడలేని కోరం ఈ రోజు సభలలో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఒకసారి ఆత్మ విమర్శన చేసుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రిగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగుడుతూ చంద్రబాబు నాయుడు, రోశయ్య కంటే కూడా సీఎం కేసీఆర్ దేవుడు అని అన్నది మీరు కాదాని ప్రశ్నించారు.
కోరం లక్ష్మీ పేరు మీద భూకబ్జాలు
కోయగూడెం ఓసీ వద్ద కోరం లక్ష్మీ పేరు మీద భూకబ్జాలు చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఏవైతే మీరు చేస్తున్నారో ఆత్మీయ పలకరింపుల పేరుతో ప్రతి ఇంటిని తడుతున్న మీరు ఆ ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుతు న్నాయా అని అడగాలని అడిగిన తర్వాత బహిరంగ చర్చకు రావడానికి సిద్దమాని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కీలక నేతలు పాల్గొన్నారు.