Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలోని పేద ప్రజల ఆరాధ్యుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాత పాల్వంచలోని వనమా స్వగృహంలో పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన 31 మంది పేద లబ్ధిదారులకు రూ.26 లక్షల 25 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వనమా అందజేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు పేదవారి సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ సరస్వతి, బీఆర్ఎస్ నాయ కులు ఎంఏ రజాక్, నరేందర్, వీర్రాజు, కిరణ్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.