Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులతో పాటు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో రెండవ విడత అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాప్యం జరుగుతుందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించి వారికి హక్కు పత్రాలు అందజేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఆన్లైన్ చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని ఇంటి స్థలాల విషయం పరిశీలన ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా నాయకులు వెలమ రాజేందర్, పర్సబోయిన రాధా కృష్ణ, ములకలపల్లి గోపీనాథ్, గోడ్డు గొర్ల నాగరాజు, రామదాసు రబ్బాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.