Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నబి
నవతెలంగాణ-ఇల్లందు
నేటి మహిళలకు విమల రణదివే జీవితం ఆదర్శమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నబి అన్నారు. సోమవారం ఏలూరు భవన్లో సోమవారం విమల రణదివే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జీవితాంతం సామ్రాజ్యవాద వ్యతిరేకిగా నిలబడ్డారని అన్నారు. పేదలతో, కార్మిక వర్గంతో సంఘీభావాన్ని పెంచుకుని కమ్యూనిస్టుగా మారారు. తన తోబుట్టువులను పోషించటానికి పనిలో చేరారు. కమ్యూనిస్టయిన బీటి, రణదీవెను పెళ్ళి చేసుకున్న రోజునే ఆయన అండిర్గౌండ్లోకి వెళ్ళారు. ఎమర్జెన్సీతో పాటు అనేక సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో గడిపారన్నారు. తన కుటుంబ పోషణ కోసం కొద్ది కాలం పాటు సినిమాల్లో నటించారన్నారు. ముంబాయి కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడంలో కృషి చేశారు. సిఐటియు నాయకత్వంలో మహిళా ప్రాతినిధ్యం పెంపు కోసం ఆమె పోరాడారు. ఈ కార్యక్రమంలో కుమారి, లక్ష్మీ, సలేంద్ర, ఉమాదేవి, స్వరూప, మంజుల, కోటేశ్వరి, మౌనిక, రామ్బాయి, రాజయ్య, బిక్కులాల్, నాగేశ్వరరావు, వెంకన్న అశోక్, తదితరులు పాల్గొన్నారు.