Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం ఇల్లందు గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని అన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు రైతుబంధు, దళితబంధు, ఇంటింటికి నల్లా కలెక్షన్, కల్యానలక్ష్మీ, షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కనబడట్లేదా అని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే వీళ్ళు మాత్రం తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అనడం విడ్డురంగా ఉన్నదన్నారు. ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది గెలిచి తీరుతా మని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనీయర్ నాయకులు భవాని శంకర్, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ముత్యంబాబు, అడపా అప్పారావు, నవీన్, యాదగిరి గౌడ్, టిబిజికె ఎస్ అధ్యక్షులు ప్రభాకర్‌రావు, వట్టం రాంబాబు, మాజీ ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు.