Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ఆర్హతలేదని, ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా...హ్యాట్రిక్ సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ అవ్వడం ఖాయమని, పొంగులేటి వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతి నిధులపై వేటు తప్పదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వనమా మాట్లాడుతూ ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని విమర్మించే ఆర్హతలేదన్నారు. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ది వీరిద్దకి కనిపించడంలేదా అన్నారు. కళ్ళు లేని వాళ్లకు సీఎం కేసీఆర్ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని ఎద్దెవ చేశారు. ఎవరేన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, హాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. దేశంలోని ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని పొగుడుతుంటే, పొంగులేటికి, జూపల్లికి కనబడకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమం చేశారని గుర్తుచేశారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది మీకు తెలియదా...అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మొన్నటిదాకా టిఆర్ఎస్ పార్టీలోనే ఉండి కెసిఆర్, కేటీఆర్‌లకు తెగ పొగిడిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు. జూపల్లి కృష్ణారావు నీ బూటకపు మాటలు కట్టిపెట్టు నీవు సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయికి ఎదగలేదన్నారు. నీవు కొల్లాపూర్‌లోనే గెలవలేకపోయావు, ఇక్కడ కొత్తగూడెంలో ఏమి చేయగలవన్నారు. పొంగులేటి వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులకు కూడా వేటు తప్పదన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, టిఆర్ఎస్ నాయకులు ఎంఏ.రజాక్, ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాష తదితరులు పాల్గొన్నారు.