Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 నుండి ఉద్యోగలు సమ్మెలోకి
- సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-లక్ష్మీదేవిపల్లి
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో అనేక రూపాల్లో గతం కొంత కాలంగా అనేక ఆందోళనలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగనుంది. విద్యుత్ ఉద్యోగు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 నుండి సమ్మెలోకి వెళ్లనున్నారు. టీఎస్పీఈ ఏజేసీ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ) పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్కిల్ ఆఫీస్లో 17 నుండి సమ్మె లోకి వెళ్ళడానికి సమ్మె సైరన్ మోగించారు. దానికి ప్రతీకగా సోమవారం సమ్మె వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నాయకులు మోహన్ రావు, ఎస్ఏఓ మురళి, డిఇ రవి, ఏఇ రఘు రామయ్య, ఏఇ సునీతా, హేమంత్, గణేష్ బాబు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.