Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల దరఖాస్తుల స్వీకరించిన పీవో
నవతెలంగాణ-భద్రాచలం
నిరుపేదలైన ఆదివాసీ గిరిజన కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించుకోవడానికి, ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే గిరిజన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పీఓ గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి దరఖాస్తు దారునికి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజన దర్బార్లో గిరిజనులు సమర్పించిన అర్జీలలో స్వయం ఉపాధి పథకాలు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు, సబ్సిడీ ద్వారా లభించే ట్రైకార్ రుణాలు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, మోటారు, బోరు ఏర్పాటు, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, కిరాణా షాపు, ఫ్యాన్సీ స్టోర్లు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, మారుమూల గిరిజన గ్రామాలలో కరెంటు సౌకర్యం, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం, అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించు కోవడానికి వృత్తి శిక్షణ శిక్షణలు ఇప్పించుట, గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్లో గిరిజన గిరిజనులు సమర్పించిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతలవారీగా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ఓ సురేష్ బాబు, డీటీఆర్ఓఎఫ్ఆర్ శ్రీనివాస్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ప్రమీల బారు, దుర్గయ్య, వెంకటేశ్వర్లు, సుగుణ, నాగభూషణం, రాజా చార్యులు, బాల మల్లు, రాందాస్, చలపతిరావు, జేడియం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.