Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ఎస్. అజరయ్య, ఆర్.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ చెల్లించాలని, విశ్రాంతి ఉద్యోగులకు నాణ్యమైన, అపరిమితంగా వైద్య సేవలు అందించాలని, అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రులలో అందించాలన్నారు. తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఆనంద్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, నారాయణరావు, రామారావు, మోహన్రావు, సుధాకర్ రావు, పుల్లయ్య, అజరు కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. నిరసన దీక్షలో పలు మండలాల, శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర విశ్రాంత ఉద్యోగులు ప్రసంగించారు.