Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమిష్టి కృషి వల్లే : కలెక్టర్
- అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు
నవతెలంగాణ-పాల్వంచ
సమిష్టి కృషి వల్లే ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని కలెక్టర్ దుడిశెట్టి అనుదీప్ తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 16 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఆయిల్ మొక్కలు నాటాలని ఉద్యానవన శాఖ లక్ష్యం కేటాయించినట్లు చెప్పారు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించినందుకు ఉద్యాన వ్యవసాయ ఆయిల్ షెడ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. పామ్ ఆయిల్ మొక్కలు నాటే లక్ష్యం సాధించిన సందర్భంగా కలెక్టరేట్లో ఉద్యాన వ్యవసాయ ఆయిల్ఫేడ్ అధికారులు డ్రిప్ కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి లక్ష్యాన్ని సాధించిన ప్రగతి నివేదికలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంప్రదాయ పంటలు సాగవల్ల భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గడంతో పాటు రైతుకు ఆదాయం కూడా రావడంలేదని గమనించామని సాంప్రదాయ పంటల నుండి వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గుచూపు విధంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం సూచనలు పాటిస్తూ రైతులు ఆయిల్ ఫామ్‌కు సాగుకు ముగ్గు చూపడం చాలా సంతోషమని ఈ సందర్భంగా రైతులను అభినందించారు. ఆయిల్ ఫామ్‌లో అంతర వంటలు సాగు చేపట్టి అదనపు ఆదాయం సంపాదించాలని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారని, జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించడం వల్ల ఇతర రంగాలు సైతం అభివృద్ధిలో ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో ఈ సంవత్సరం 16135 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 16508 ఎకరాల్లో మొక్కలు నాటి బిందు సేద్యం సౌకర్యం కల్పనలో కూడా ప్రథమ స్థానంలో నిలిచామని ఆయన పేర్కొన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు ఉద్యాన వ్యవసాయ అధికారులు కల్పించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. పామాయిల్ పంటకు చీడా పీడలు ఆశించవని సాగు ఖర్చు తక్కువ ఆదాయం కూడా ఎక్కువ కావడంతో ప్రభుత్వం రైతులను ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం మండలానికి చెందిన పెనుబల్లి గంగరాజు దుమ్ముగూడెం మండలంలో సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, ఆయిల్ ఫామ్ పంట సాగు చేపట్టిన సందర్భంగా కలెక్టర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఏడీఏలు రవికుమార్, లాల్ సింగ్, ఉద్యాన అధికారులు శాంతిప్రియ, సందీప్, పర్యవేక్షకులు విజరు కుమార్, ఆయిల్ ఫెడ్ అధికారులు ఆకుల బాలకృష్ణ, అప్పారావు, రాధాకృష్ణ, డ్రీప్ కోఆర్డినేటర్స్ నరసింహారావు, వినరు, బాలాజీ, రఫీ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.