Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియా నుండి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్, డెత్ కార్మికుల వారసులకు మంగళవారం కార్యాల యంలో జీఎం ఎం.షాలేము రాజు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణిలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, అలాగే భూగర్భ గనుల్లో పనిచేస్తే నైపుణ్యత పెరుగుతుందని, పనిప్రదేశంలో ఎల్లప్పుడూ రక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. రామగుండం-1 ఏరియా భూగర్భ గనిలో పనిచేయుటకు నియామక ఉత్తర్వు అందజేశామని రామగుండంఏరియా జీఎంకు రిపోర్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాసు, డీజీఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్, సినియర్ అసిస్టెంట్ జి.రవి తదితరులు పాల్గొన్నారు.