Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి సభలో జెడ్పీ చైర్మన్ కోరం
నవతెలంగాణ-ఇల్లందు
కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫూలే జయంతి కార్యక్రమానికి కోరం హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. ఈ కార్యాక్రమంలో కౌన్సిలర్ పత్తి స్వప్న, సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, తాటి చుక్కమ్మ, పూనెం కవిత, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, తాటి యశోద, ఉప సర్పంచులు తాటి రాంబాబు, ఎల్లయ్య, నాయకులు సాంబమూర్తి, సూర్యం, శ్రీనివాస్, ధనుంజరు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.