Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన వంశస్తుల సాంప్రదాయ జాతరలు : పొదెం వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోనిపైడిగూడెం గిరిజన గ్రామంలో కంగాల వంశస్తుల ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇరుసలింగో ఇందుల గంగో జాతర ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు జాతర ఉత్సవాలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు అనాధిగా వారి వారి కుల వంశీకుల పేరుతో గిరిజన సాంప్రదాయ పద్దతులలో కొంగు బంగారంగా కొలిచే దేవతలను కొలుచుకోవడం మూడు రోజుల పాటు సంబురంగా జాతర ఉత్సవాలు నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తోందన్నారు. ముగింపు జాతర ఉత్సవాల్లో ఎంపీపీ రేసు లకీë, కంగాల వంశప్తులు మాజీ సర్పంచ్ కంగాల వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కంగాల పుల్లమ్మ, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్పార్టీ అద్యక్షులు లంకా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామారావు, శీరపు అప్పలరెడ్డి, బూరలకీë నారాయణ, యూత్ నాయకులు లంకా శివకుమార్, సోషల్ మీడియా జిల్లా చైర్మన్ కనుబుద్ది దేవా తదితరులు పాల్గొన్నారు.