Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రివ్యూ మీటింగ్లో మున్సిపల్ చైర్మెన్, కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో సేవలు అందించాలని పనివేళలో అలసత్వం సహించమని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు, కమిషనర్ అంకు షావలి అన్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చ్ నెలతో ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు అయినందున నూతన ఫైనాన్షియల్ ఇయర్లో చేపట్టాల్సిన పనులను ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేసేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అందరం స్వయంకృషితో పని చేస్తే గుర్తింపులు వాటంతటవే వస్తాయని తెలియజేశారు. సమిష్టి కృషి చేసి రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకోవాలని తెలిపారు. గత సంవత్సరం జనవరి నాటికి 60 శాతం పన్ను వసూలు పూర్తి అయిందని ఈ ఫైనాన్షియల్ ఇయర్ జనవరి నాటికి 90శాతం పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు తెలిపారు. పురపాలక సంఘానికి ఆదాయ వరులు పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎకౌంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.ఐ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, టీడీఓ సతీష్ జూనియర్ అసిస్టెంట్లు, జవాన్లు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.