Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధిపత్య భావజాలం ముందుకొస్తోంది..
- మతమౌఢ్య భావజాలాన్ని తిరస్కరించిన పూలే
- కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు
- జ్యోతిరావు 197వ జయంతి సభలో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, బాగం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్ బానిసత్వమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతుందని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బాగం హేమంతరావు అన్నారు. ఆధిపత్య భావజాలం ముందుకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మను ధర్మానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. పూలే జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక మంచికంటి మీటింగ్ హాల్లో సిపిఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రసంగించారు. ఏ మూఢనమ్మకాలు, ఏ మతమౌఢ్యం పైనైతే జ్యోతిరావు పూలే పోరాడారో తిరిగి వాటిని ఆచరణలోకి తెచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూనుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే మతం పేరుతో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా బిజెపి, దాని అనుబంధ సంస్థలు ర్యాలీలు నిర్వహిస్తూ చర్చిలు మసీదుల పై దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. బ్రాహ్మణ ఆధిపత్య బావజాలంపై పూలే వంటి వారి పోరాడితే...నేడు మరో రూపంలో ఆధిపత్య ధోరణి ముందుకు వస్తోందని హెచ్చరించారు. సామాజిక కోణంలోనే కాకుండా ఆర్థిక, మతపరమైన దాడులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. వీటన్నింటి నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందన్నారు. సీపీఐ జిల్లా నాయకులు శింగు నరసింహారావు, సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ (ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్ మాట్లాడారు. సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, వై.విక్రమ్, సీపీఐ జిల్లా నాయకురాలు సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : అణగారిన వర్గాల హక్కులు, అభివద్ధి కోసం అనునిత్యం పరితపించిన మహౌన్నత వ్యక్తి మహాత్మ జ్యోతి రావు పూలే అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అన్నారు. స్థానిక గాంధీచౌక్ సెంటర్లో సిఐటియు త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీనివాసరావు, జియంపియస్ జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య, హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు యస్కె సైదులు, ఐద్వా జిల్లా నాయకులు పత్తిపాక నాగసులోచన, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, కన్వీనర్ యర్రా మల్లికార్జున్, నాయకులు వేల్పుల నాగేశ్వరరావు, సోమనబోయిన వెంకటేశ్వర్లు, మట్టిపల్లి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, మల్సూర్, వెంకటేశ్వర్లు, తులసి రాం, వెంకన్న, సాయి పాల్గొన్నారు.
మధిర : మధిర బోడెపుడి భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో మరియు సివిల్ సప్లై గోడౌన్స్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ు పూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శీలం నరసింహారావు, పార్టీ టౌన్ కమిటీ సభ్యులు తేలపోలు రాధాకష్ణ, పడకండి మురళి, పల్లి కంటి వెలసన్, మండల కమిటీ సభ్యులు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అడ్రన్నకు మధు, సివిల్ సప్లై కార్మికులు నాగమల్లేశ్వరరావు, నాగరాజు పాల్గొన్నారు.
కారేపల్లి : కారేపల్లిలో జ్యోతిరావ్ పూలే 196వ జయంతిని కారేపల్లిలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షకార్యదర్శులు ఆర్.శ్రీరాములు, సారయ్య, నాయకులు రమేష్, రాజు, కోటయ్య, జానీ, తిరపయ్య, సంపత్, బాబు, ఆటో యూనియన్ నాయకులు కుర్సం శ్రీను పాల్గొన్నారు.
సత్తుపల్లి : సీపీఐ(ఎం), సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మాజ్యోతిరావుపూలే జయంతిని పట్టణంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకలు మోరంపూడి పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు పట్టణంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కరీం, రవి, కిరణ్, సుభాని, జిలాని, వెంకటేశ్వరరావు, మీరా, సైదా, వలి, వెంకట్రావు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: సీపీఐ(ఎం), సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పి.మోహన్రావు, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాపిట్ల సత్యనారాయణ, సీపీఎం నాయకులు వల్లూరు సీతారాంరెడ్డి, రత్నాకర్, సీఐటీయూ నాయకులు దేవ్ జా, వెంకటయ్య, పి.రవి కుమార్, గుండె తిరపయ్య, నాగయ్య, కృష్ణ, సుబ్బయ్య పాల్గొన్నారు.
బోనకల్ : కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు యంగల ఆనందరావు, నాయకులు బిల్లా విశ్వనాథం, వీరబాబు, ఏసుపోగు బాబు, సాధన పల్లి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.