Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ఫూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మహాత్యాజ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలుప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నివాళిఅర్పించారు. ఆయన అశయ సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
కొత్తగూడెం బార్లో...బార్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్
భారత దేశ సామాజిక అభివృద్ధికి ఆటంకమైన కుల వ్యవస్థ నిర్మూలనకై కృషి చేయటమే మహాత్మా జ్యోతిరావు ఫ్యూలేకి ఇచ్ఛే నివాళి అని, దేశ భక్తులంతా ఫ్యూలే దారిలో నడవాలని, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్ అన్నారు. సోమవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాలులో జరిగిన ఫూలే జయంతి సభలో ఆయన ప్రసంగించి, ఘనంగా నివాళులు అర్పించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దుండ్ర రమేష్, ప్రధాన కార్యదర్శి రవిలాల రామారావు, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి సంతోష్ సాహు, లైబ్రేరి సెక్రెటరీ యాస యుగంధర్ నాయుడు, మహిళా ప్రతినిధి అత్తులూరి మనోరమ కూడా ఘనంగా నివాళులు అర్పించారు. న్యాయవాదులు సింగు ఉపేందర్ రావు, కొదు మూరు సత్యనారాయణ, కీలరు పురుషోత్తం, లక్కినేని సత్య నారాయణ, కె.నాగేశ్వర్ రావు, మారపాక రమేష్ ప్రసంగిం చారు. సీనియర్ న్యాయవాదులు వై.ఉదయ భాస్కర్రావు, ఆర్. వెంకటరత్నం, వి.వి.సుధాకర్ రావు, జె. గోపికృష్ణ, జి. రామచంద్రా రెడ్డి, జి.కె.అన్నపూర్ణ, పి. నాగేశ్వర్ రావు, రాజమల్లు, పి.నిరంజన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
బీఎప్పీ ఆద్వర్యంలో : బహుజనుల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా, కేతిని కుమారి, ఎర్రంశెట్టి రాజేశ్వరి, గంధం శారద, నవ్య సమీరా, మృధు సారిక తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో : సమాజంలో కొనసాగుతున్న వివక్షతకు, అణచివేతలకు గురవుతూ అంధకారంలో మగ్గుతున్న పీడిత కులాలకు, మహిళలకు వెలుగుదారి చూపిన మహౌన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జయంతిని జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కె.రత్నకుమారి, భూక్యా శ్రీనివాస్, నాయకులు భాగం మహేశ్వరరావు, నాగయ్య, చింతల రాజు, సోమయ్య, విజయలక్ష్మి, కారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రామవరంలో : జయంతి ఉత్సవాలను రామవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రారంభించారు. రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్ (మాదిగ సంక్షేమ సంఘం) ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పూలమాలతో ఈ వేడుకలను ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వెంకన్న, బరిగెల భూపేష్, సామర్ల సమ్మయ్య, ఆవులూరి సంజీవరావు, ఇల్లందుల దుర్గ, కూరగాయల శీను, కాంపెళ్లి దుర్గయ్య, రామంచి శ్రీను, కొత్తూరు మధురయ్య, బొంకూరి పోశం, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో
సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి సభ జరిగింది. తొలుత జ్యోతిరావు పూలే చిత్రప టానికి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, బి.రమేష్, రేష్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో జ్యోతిరావు ఫూలే జయంతి
పాల్వంచ : విద్య సమపర్చిన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని భావించి అణగారిన వర్గాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు మహనీయుని జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్షరాలను ఆయుధంగా చేసుకొని అనగానే వర్గాల విద్య అభివృద్ధికి విచ్చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని చెప్పారు. స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి సాధ్యం కాదని భావించిన జ్యోతిరావు పూలే నిరక్షరాసులైన తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయులు చేశారని చెప్పారు. విలువలకు కట్టుబడి దేశానికి సమాజానికి ఎనలేని సేవలు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ అధికారి సురేందర్, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు, సభ్యులు మడిశెట్టి శ్రీనివాసరావు, శంకర్, కిషోర్, రాజేశ్వరి, కే.సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బండి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.