Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోరం నీకు దమ్ముంటే జడ్పీటీసీ, జడ్పీ
- చైర్మన్ పదవికి రాజీనామా చేయ్ పోటీకి సిద్ధం
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కుట్ర దారు
- విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ హరిసింగ్
నవతెలంగాణ-ఇల్లందు
దమ్ము ధైర్యం లేని కోరం కనకయ్య ఇప్పటికీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బిక్షగా వేసిన జడ్పీ చైర్మన్ హౌదాలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని వెక్కిరించడం సిగ్గులేని పని అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి అప్పుడు పోటీకి రా నీతో పోటీకి నేను సిద్ధం అంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్ సవాలు విసిరారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోసం టేకులపల్లి నందు నిర్మించిన ప్రజా వైద్యశాలను చూసి మతిభ్రమించి మాట్లాడుతున్నవని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కుట్ర దారు. పార్టీ బీ పామ్ తీసుకున్న అభ్యర్థుల ఓటమి కోసం పని చేసిన వ్యక్తని ఆరోపించారు. హరిప్రియ తండ్రికి సంబంధించిన భూమి జడ్జిమెంట్ 2016లో వచ్చింది అప్పుడు ఎమ్మెల్యే నువ్వే కదా. హరి ప్రియ కాదు కదాన్నారు. తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవి మీద కక్కుర్తితో ఇప్పటికీ ఉన్న పదవిని వదులుకోలేక అదే పదవిలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని వెక్కిరించడం బుద్ధిలేని పని అని అది నీ చదువురాని తత్వానికి నిదర్శనం అని వెక్కిరించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, టేకులపల్లి మండల అధికార ప్రతినిధి చీమల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ టేకులపల్లి మండల నాయకులు కిషన్ నాయక్, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, 11 వార్డ్ కౌన్సిలర్ చేరుపల్లి శ్రీనివాస్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు పెండ్యాల హరికృష్ణ, మురళి, పివి కష్ణారావు, ఇల్లందు మండల ఇంచార్జ్ యలమద్ది రవి, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల బబ్లూ, ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబు, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నెమలి ధనలక్ష్మి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.