Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో గౌతం పొట్రు
నవతెలంగాణ-మణుగూరు
గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల దీటుగా అన్ని రకాల హంగులతో సౌకర్యాలు కల్పించి, నిష్ణాతులైన అధ్యాపకులను నియమించి ప్రత్యేక విద్యా బోధన చేయడానికి అన్ని వసతి సౌకర్యాలతో కళాశాల భవనాలను నిర్మించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ అన్నారు. మంగళవారం మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలో టీడబ్ల్యూయూ ఆర్జేసీ బాలికల కళాశాల ముందు ఉన్న ఖాళీ స్థలంలో రూ.రెండు కోట్ల 70 లక్షల వ్యయంతో విశాలవంతమైన 16 తరగతి గదులు నిర్మాణం చేపట్టడానికి స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీలకు సౌకర్యవంతంగా క్లాస్లో ఉండి చదువుకోవడానికి తరగతి గదులు వారికి అనుకూలంగా నిర్మిస్తున్నామన్నారు. డార్మెంటరీ సపరేట్గా ఉండాలని, కళాశాలలో ఏది తక్కువ కాకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రతిపాదనలు రూపొందించి భవనం నిర్మాణం చేపడుతున్నామన్నారు. భవనం చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థినీలకు సౌకర్యవంతంగా ఉండేలా టాయిలెట్లు, బాత్రూములు నిర్మాణం చేపడుతున్నామన్నారు. బాలికల కళాశాల అయినందున చుట్టూతా ప్రహరీ గోడ తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా వాచ్మెన్ గదినిర్మానం కూడా చేపట్టాలని అన్నారు. అదేవిధంగా రూ.ఐదు కోట్లలతో తయారు చేసే ప్రతిపాదనలో డైనింగ్ హాలు, క్రీడాస్థలం, తరగతి గదులు వేరువేరుగా ఉండేలా చూడాలన్నారు. మంచినీటి సమస్య తలెత్తకూడదని, డ్రైనేజీ వాటర్ పొలాలకు ఇబ్బంది కలగకుండా పోయేలా సపరేట్ మార్గం ప్రతిపాదనలో పొందపరచాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో (జనరల్) ఇన్చార్జి ఆర్సీఓ గురుకులం డేవిడ్ రాజ్, డీఈ రాములు, ఏఈ వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్ఐ శ్రీనివాస్, సర్వేయర్ తిరుపతయ్య, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.