Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో మహాధర్నా
- రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న 5000 మంది ఆర్టిజెన్స్
- స్పందించకుంటే 25 నుండి సమ్మెకు దిగుతాం
- మద్దతు ప్రకటించిన వామపక్షాలు
నవతెలంగాణ-పాల్వంచ
టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిటిషన్లందరినీ ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని స్టాండింగ్ ఆర్డర్‌ను రద్దుచేసి కన్వర్షన్ అమలు పరచాలని, ఆర్టిజన్స్ అందరికీ 50 శాతం ట్రీట్మెంట్తో కలిసి పీఆర్సి అమలుపరచాలని, ఈపీఎఫ్ సీలింగును ఎత్తివేసి అన్లిమిటెడ్ ఈపీఎఫ్‌ను అమలు చేయాలని, ఐడీ నెంబర్ కలిగిన కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్ 82 ఆధ్వర్యంలో గురువారం పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంబేద్కర్ సెంటర్లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది కార్మికులు పాల్గొని కతం తొక్కారు. ఆర్టీజన్లో నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఈ మహా ధర్నాకు వామపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్-82 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు మాట్లాడుతూ యాజమాన్యం తక్షణమే స్పందించి ఆర్టిజన్ల ప్రధాన సమస్య ఏపీఎస్ఈబి కన్వర్షన్, 50శాతం పిఆర్సీ, ఇతర సమస్యలపై చర్చించి పరిష్కారించకుంటే 25వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23000 మంది ఆర్టిజన్లు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదని తమవి న్యాయబ ద్ధంమైన, రాజ్యాంగబద్ధమైన కోరికలని ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉంటాయని ఎందుకు మా ఆర్టిజన్ల మీద బ్రిటీష్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను రుద్దుతున్నారని ప్రశ్నించారు. తాము ప్రభుత్వానికి ఏ మాత్రం వ్యతిరేకం కాదని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ సంస్థలోని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయమని యాజమాన్యానికి చెప్పినా యాజమాన్యం మాత్రం మామీద ఈ బ్రిటీష్ రూల్స్ రుద్దుతూ వెట్టిచాకిరి చేయిస్తున్నదని, ఇది ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ప్రపంచానికి వెలుగును పంచి చీకటి జీవితాలు గడుపుతున్న ఆర్టిజన్ల న్యాయమైన డిమాం డ్లను పరిష్కరించి 23000 మంది ఆర్టిజన్ కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఈ ధర్నాకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ మహాధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ఆర్టిజన్లతో వ్యక్తి చాకిరీ చేయిస్తున్నారని మీరు అడిగే డిమాండ్లు న్యాయమైనవని తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టిస్టులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శియెర్రా కామేష్ మాట్లాడుతూ తక్షణమే సమస్య పరిష్కరించాలని, ఆర్టిజన్ల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్-82 జెన్కో రాష్ట్ర కార్యదర్శి ఆవుల క్రిష్ణా రెడ్డి, అధ్యక్షులు ఉండేటి జయరాజు, జలీల్, బాలకృష్ణ, బాల్ రెడ్డి, శ్రీకాంత్, రాము, పురుషోత్తం, సునీల్, హనుమంతరావు, మధు, మసూద్, కేసరి రవీందర్, శంకర్, సాంబ, అనిల్, నవీన్, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, దస్రు, సత్యం, శ్రీను, సమి, కోటేశ్వరరావు, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ మహా ధర్నాకు సీపీఐ కమిటీ నాయకులు బీజేపీ ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ నాయకులు వూకంటి గోపాలరావు, ముత్తయ్య, నాగరాజు తదితరులు మద్దతు తెలిపారు.