Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు
- జిల్లాలో 134 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- కలెక్టర్ అనుదీప్
- మద్దతు ధర పోస్టులు ఆవిష్కరణ
నవతెలంగాణ-పాల్వంచ
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సహకార శాఖ డీఆర్డీఏ వ్యవసాయ జీసీసీ మార్కెటింగ్ తూనికల కొలతల రవాణా రైస్ మిల్లలతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సహకార శాఖ ద్వారా 99 జీసీసీ ద్వారా 32 డీఆర్డిఏ ద్వారా మూడు మొత్తం 134 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్యాగింగ్ చేసిన 25 మిల్లులకు చెరపరా చేయనున్నట్లు తెలిపారు. క్రాఫ్ బుకింగ్ చేసిన ప్రకారం వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులకు వ్యవసాయ అధికారులు ధృవీకరణ పత్రం జారీ చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు రద్దీ నియంత్రణకు గ్రామ పద్ధతి పాటించేందుకు తేదీల వారిగా కొనుగోలు చేసేందుకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యత పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో తార్పాలెంలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు ధాన్యం రాకుండా సరిహద్దుల్లో పోలీస్, రెవెన్యూ వ్యవసాయ అధికారులతో చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని దళాలను ఆశ్రయించొద్దని పేర్కొన్నారు. క్వింట ఏ గ్రేడ్ రకానికి రూ.2060 మతకరకానికి రూ.2040 మద్దతులను ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం వరి పంటకు మద్దతు నాణ్యత ప్రమాణాలు కనీస మద్దతు ధర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ మల్లికార్జున్, డీఎం త్రీ నాథ్ డీసీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, జీసీసీ టీఎం విజయకుమార్, మార్కెటింగ్ ఎడి ఆల్ ఇన్ వ్యవసాయ అధికారి అభిమన్యుడు, తునికెళ్ళకొలతల అధికారి మనోహర్, రవాణా శాఖ అధికారి రెడ్డి, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు జూగల్ కిషోర్, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.