Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి గ్రామానికి నూతన సీసీ రోడ్లు
నవతెలంగాణ-టేకులపల్లి
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి అస్తమని, ప్రతి గ్రామానికి నూతన సీసీ రోడ్లు, సంక్షేమ పథకాలే సమాధానమని, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు బానోత్ హరిప్రియ నాయక్ అభిప్రాయపడ్డారు. గురువారం మండలంలోని కోయగూడెం పంచాయతీలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్ నుంచి సంపత్ నగర్‌కు వెళ్లే రహదారికి రెండు కోట్ల యాభై లక్షల ఎఫ్డీఆర్ నిధులతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు. గత ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి సౌకర్యం లేక వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడుతూ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సంపత్ నగర్ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా రైతు బంధు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ భూక్య. రాధా, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాలు నాయక్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఎంపీటీసీ జాల సంధ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.