Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
పేదల ఆకలిని గుర్తించేదే పవిత్ర రంజాన్ పండుగ మాసమని, ఈ పండుగలో పేదలు భాగస్వామ్యం చేసి వారిని సంతోషంగా ఉంచడం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మండల కేంద్రంలో టీఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు, మహ్మద్ ఖాజీమ్లీ సహకారంతో 100 పేద కుటుంబాలకు రంజాన్ తోఫాను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎస్ కె. సాబీర్ పాషా మాట్లాడారు. గడిచిన 9 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికోసం ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టిన దాఖలాలు లేవన్నారు. టీఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు, మహ్మద్ ఖాజీమ్ అలీలు తమ సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, వెల్ఫేర్ సంస్థ అధ్యక్షులు ఎండీ.యూసఫ్, ఎంపీటీసీ జబ్బార్, ఎంపీటీసీ పుల్లారావు, ముస్లిం పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి మండల కేంద్రమైన టేకులపల్లి మసీద్ ఆవరణలో ప్రభుత్వం రంజాన్ పండగకు ముస్లింలకు బట్టలు పంపిణీ గురువారం తహసీల్దార్ అంజద్ పాషా ఆధ్వర్యంలో 125 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ సరిత, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండి మౌలానా, మత పెద్ద, రెవెన్యూ సిబ్బంది, మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి మండలంలోని ముస్లీం సోదర, సోదరీమణులకు స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రములోని రైతు వేదికలో 140 మంది ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫా (బట్టలు) పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మందా మంగమ్మ, డీటీ అనుష, ఆర్.ఐలు సోయం రామయ్య, బుల్లిబాబు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సహాయ కార్యదర్శి మొహమ్మద్ ఖయ్యూం, ఎండీ.ఆదం, మత పెద్దలు, రెవెన్యూ సిబ్బంది స్వామిదాసు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.