Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ 10వ ఆవిర్భావ దినోత్సవ సభలో జిల్లా కార్యదర్శి జయరాజు
నవతెలంగాణ-ఇల్లందు
ఉపాధ్యాయుల సమస్యల సాధనకు పోరాటాలే శరణ్యమని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం యుటిఎఫ్ 10వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించినారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఐక్య ఉద్యమాల ద్వారా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సీసీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ఇల్లందు, గుండాల, టేకులపల్లి మండల అధ్యక్షులు రాంబాబు, మంగ తాయి, వీరన్న, నాయకులు శేషగిరిరావు, పి.రమేష్, ఎల్.వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మణుగూరు : యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు మండల జనరల్ సెక్రెటరీ వాయిస్ ఆఫ్ తెలంగాణ జిల్లా కన్వీనర్ కారం సీతారామయ్య తెలిపారు. గురువారం కరకగూడెం, పినపాక, మణుగూరు మండలాలు టీఎస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కో-ఎడ్యుకేషన్ మణుగూరు పాఠశాలనందు నిర్వహించామన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నిట్ట రాంబాబు, మణుగూరు ఉపాధ్యక్షులు ఎం.రాజ, కరకగూడెం బి.సురేష్, వి.కిరణ్, జనరల్ సెక్రటరీ బి.భాస్కర్, పినపాక మూడు మండలాలు సభ్యులు పాల్గొన్నారు.
పాల్వంచ : సంఘ నిర్మాణ కర్త కామ్రేడ్ చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాలు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకోవాలని, విద్యాభివృద్ధికి కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పాల్వంచలో యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇందులో సీనియర్ నాయకులు కామ్రేడ్ బండి జానకీ రాములు పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎస్.కె యాకూబ్ పాషా, ఉపాధ్యక్షులు బి.మంగిలాల్, ఏఎన్ఆర్ సీనియర్ నాయకులు ఏ.సత్యనారాయణ, వీటీఆర్ మోహన్ రావు, ఎస్.కె రహీముద్దీన్ సంతోష్, పాల్గొన్నారు.