Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళి అర్పించిన ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భారతీయులపై జరిగిన అత్యంత ఆమానుష సంఘటన జలియన్ వాలాబాగ్ ఘటన అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారయణలు అన్నారు. గురువారం చారిత్రక ప్రదేశాన్ని యాదృచ్ఛికంగా వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సరిగ్గా 104 సంవత్సరాల క్రితం 1919 ఏప్రియల్ 12న ఇదే రోజు జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ అధికారి అయిన డయ్యర్ నాటి స్వతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాడుతున్న భారతీయులపై అత్యంత ఆమానుషంగా క్రూరంగా కాల్పులు జరిపినటువంటి సందర్భంలో 379 మంది చనిపోవడం 1500 మంది పైగా గాయపడటం జరిగిందని తెలిపారు. అటువంటి చారిత్రక ప్రదేశాన్ని యాదృచ్ఛికంగా నేతలు సందర్శించి, ఘనమైన నివాళుఅర్పించారు. ఈ కార్యక్రమంలో పట్నం జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోండబోయిన వేంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, కర్ల వీరస్వామి, రమేష్ బాబు, శ్రీరామ్మూర్తి శ్రీనివాస్, ఇందిర, పద్మ, నాగమణి, కృష్ణవేణి, రమ, రాధ తదితరులు పాల్గొన్నారు.