Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ములుగు జిల్లా ఇన్చార్జిగా కర్ర అనిల్ రెడ్డి నియమితులయ్యారు. గురువారం సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఆయనకు ములుగు జిల్లా బాధ్యతలను అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రిడిటేషన్ నెంబర్‌గా యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న అనిల్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంఘం బలోపేతానికి తనదైన శైలిలో ఎనలేని కృషి చేశారు. జిల్లాలో మిగతా ట్రేడ్ యూనియన్ల కంటే అత్యధిక సభ్యత్వలతో పాటు టీడబ్ల్యూజేఎఫ్ సంఘాన్ని ముందు వరుసలో ఉంచారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ తన మీద నమ్మకంతో ములుగు జిల్లా బాధ్యతలు అప్పగించిందని సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ములుగు జిల్లా బాధ్యతలు స్వీకరించిన అనిల్ రెడ్డిని పలువురు జర్నలిస్టు యూనియన్ నాయకులు జర్నలిస్టులు అభినందించారు.