Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భద్రాచలం రూరల్
ఈ నెల హైదరాబాదు మహానగరంలోని శంషాబాద్ నందు జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారులకు రెండు బంగారు పథకాలు, ఒక సిల్వర్ పథకం సాధించినారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను భద్రాచలం ఏఎస్పీ వారి కార్యాలయంలో అభినందించారు. ఏఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఎంతో ఉల్లాసాన్నిస్తాయని చెప్పి తెలిపారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ఉదయము కనీసం ఒక గంట అయినా సరే వ్యాయామం చేయాలని సూచించారు. ఈ వ్యాయామం చేయటం వలన శరీరానికి ఫిట్నెస్ మాత్రమే కాకుండా డాక్టర్ దగ్గర కూడా వెళ్లే అవసరం ఉండదు అని తెలిపారు. ఈ క్రీడాకారుల విజయానికి కారణమైనటువంటి సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఈ గెలుపొందిన క్రీడాకారులను ఫోన్ ద్వారా పట్టణంలోని పలు క్రీడా సంఘాలు, క్రీడా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షుడు వి.మల్లేష్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ తిరుమల రావు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు టి.వసంతరావు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ట్రెజరర్ వీరారెడ్డి, సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు అభినందించారు.