Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీనీ ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు మున్సిపాలిటీలో ఆయన విస్తృతంగా పర్యటించారు రాజీవ్ గాంధీ నగర్లో సుమారు రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన మరోమారు ఆ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతికి సంబంధించి సంబంధిత శాఖల అధికారుల నుండి ఫైల్ తెప్పించుకొని పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వ్యాపారులకు అందించి ప్రజలకు సమీకృత మార్కెట్లను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. అనంతరం ఆదర్శనగర్లో రూ.50 లక్షల అంచనాతో నిర్మిస్తున్న డ్రైనేజ్ని నిర్మాణ పనులను పరిశీలించి గుర్తించారు. డ్రైనేజ్ వెంట నడుస్తూ ఆ పనులను స్వయంగా రేగా పరిశీలించారు. అనంతరం వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ఈ పర్యటనలో ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ నరసింహారావు, బీఆర్ఎస్ మండల, పట్టణ పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, కార్యదర్శులు బొల్లి శెట్టి నవీన్, యాదగిరి గౌడ్, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీపీ కారం విజయకుమారి, కో ఆపరేషన్ సభ్యులు జావిద్ పాషా, వట్టం రాంబాబులతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.