Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్
- బీఆర్ఎస్ బలి తీసుకుంది : రేణుకా చౌదరి
నవతెలంగాణ-కారేపల్లి
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ బండ పేలిన ఘటనలో మృతుల పరామర్శకు గురువారం వచ్చిన కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రేణుకా చౌదరి పర్యటనకు పోలీసులు అడుగడుగున అడ్డుపడ్డారు. అత్మీయ సమ్మేళనంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ బాణాసంచా పేల్చిగా అది పక్కనే ఉన్న గుడిసెకు అంటుకోని దానిలో ఉన్న గ్యాస్ బండ పేలి ముగ్గురు మృతి చెందగా, మరో 6 గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన కారేపల్లి మండలం చీమలపాడు, స్టేషన్ చీమలపాడు, గేటురేలకాయలపల్లి గ్రామాలకు చెందిన అజ్మీర మంగు, బానోత్ రమేష్, ధర్మసోత్ లక్ష్మన్ పరామర్శకు బయలుదేరిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి ని కామేపల్లి మండలం తాళ్లగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారేపల్లి మండలంలోని అడుగు పెట్టకుండా రేణుకా చౌదరి వాహనాలను అపారు. ఈ సందర్బంగా రేణుకాచౌదరికి పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మృతుల కుటుంబాలను ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ లు పరామర్శ చేస్తున్నారని వారి పర్యటన అనంతరం అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పారు. రేణుకాచౌదరి తాళ్లగూడెం సర్పంచ్ ఇంటిలో ఉంచి గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పర్యటన అనంతరం రేణుకా వస్తుండగా చీమలపాడు వద్ద సైతం ట్రాక్టర్ ట్రాక్‌ను అడ్డుపెట్టి రేణుకా చౌదరి వాహనాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న రేణుకా చౌదరి పాటిమీదిగుంపు నుండి చీమలపాడు చేరుకున్నారు.
బీఆర్ఎస్ బలి తీసుకుంది.
ఆత్మీయ సమ్మేళనం పేరుతో అమాయకులను బీఆర్ఎస్ బలి తీసుకుందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం పేలుడు ఘటన మృతుడు ధర్మసోత్ లక్ష్మణ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ పేలుడు ఘటనకు బీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. అంత పెద్ద ఘటన జరిగినా కారకులు ఒక్కరిని అరెస్టు చేయకపోవటం శోచనీయమన్నారు. మా కార్యకర్త చనిపోతే అఖరి చూపు చూడకుండా 3 గంటలు అపారని అగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఏ చట్టం క్రింద ఆపారని పోలీసులను ప్రశ్నించారు. చేయాల్సిన ధర్మం చేయకుండా అధికార మదంతో బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 3 ఎకరాలు భూమి, రూ.50లక్షలు పరిహారం, ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌కు దేవ నవీన్ కు రూ.50 లక్షలు అందించాలని, డిపార్టుమెంట్ పరంగా అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అమాయకులకు న్యాయం దక్కేవరకు వదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారావత్ రాంమ్మూర్తి నాయక్, పగడాల మంజుల, చీమల వెంకటేశ్వర్లు, దారావత్ భద్రు, గడ్డం వెంకటేశ్వర్లు, ఈసాల ఛాయదేవి, బావుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వివాదం
చీమలపాడులో మృతుల కుటుంబాల పరామర్శల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిత్త పరిస్ధితిలు చోటుచేసుకున్నాయి. అజ్మీర మంగు కుటుంబాన్ని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌లు పరామర్శిస్తున్న క్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి అక్కడి వచ్చారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. ఈక్రమంలో బాధితులకు పరిహారం పెంచాలని, కాళ్లు కొల్పోయిన వారు జీవచ్చావంగా ఉంటారని వారి పట్ల సానుకూలంగా స్పందించి పరిహారం, ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ తాతా మధు మీరు ఏమిస్తారూ అంటూ కాంగ్రెస్ నేత గోపాల్‌రెడ్డి ఎదురు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోగ్రాంతో మృతి చెందారని, ప్రభుత్వం ఉన్నది మీదని మీరేమిస్తారంటూ మమ్ములను ఎలా అడుగుతారంటూ గోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాంచంద్రనాయక్, ఏసీపీ బస్వారెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది.
శవ రాజకీలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
మాజీ మంత్రి రేణుక చౌదరి
కామేపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తుందని, ఏ చట్టం పేరుతో నన్ను ఆపుతున్నారని మాజీ ఎంపీ రేణుక చౌదరి పోలీసులను ప్రశ్నించారు. కామేపల్లి మండలం ఖమ్మం నుండి ఇల్లందు వెళ్ళే ప్రధాన రహదారి తాళ్ళగూడెం పోలీస్‌స్టేషన్ ముందు మాజీ ఎంపీ రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సింగరేణి మండలం చీమలపాడులో జరిగిన సంఘటనలో మృతి చెందిన బాధితకుటుంబాలను పరామర్శించడానికి వెళ్తూంటే పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలాగా తమను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. దొంగలకు సెల్యూట్ కొట్టి పంపిస్తున్న పోలీసులు నన్ను ఎందుకు ఆపుతున్నారని హెచ్చరించారు. నా జీవితంలో ముందుకు అడుగు వేయడం తప్ప వెనక్కి అడుగు వేసేది లేదన్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో రోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దిష్టిబొమ్మను దగ్దం చేయవద్దని పోలీసులు అడ్డుకోని లాగేసుకున్నారు. దీంతో రేణుక చౌదరికి రాస్తారోకోకు దిగింది.