Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం సమీపంలో గ్యాస్ బండ పేలిన ఘటనలో మృతి చెందిన అజ్మీర మంగు, స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేష్, గేటురేలకాయలపల్లికి చెందిన ధర్మసోత్ లక్ష్మణ్ కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఇన్‌కం ట్యాక్స్ అడిషనల్ కమీషనర్ లావుడ్యా జీవన్‌లాల్ పరామర్శించారు. జరిగిన ఘటనపై వారి విచారం వ్యక్తం చేశారు. కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని, అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ప్రకటించిన విధంగా మృతుల కుటుంబాలు ఒక్కోక్కరికి రూ.2 లక్షల ను అందజేశారు. ప్రభుత్వ పరంగా రూ. 10 లక్షలు, బీఆర్ఎస్ పార్టీ పరంగా రూ. 5లక్షలు, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించినట్లు రూ.2 లక్షలు అందిస్తామన్నారు. ప్రభుత్వం సాయం త్వరిత గతిన అందేలా కలెక్టర్‌తో మాట్లాడమని ఎమ్మెల్సీ మధు తెలిపారు. పార్టీ పరంగా అందజేసే రూ.5 లక్షలను అంబేద్కర్ జయంతి అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదిగా అందజేయటం జరుగుతుందన్నారు. దురదుష్టకరమైన సంఘటనలో శవరాజకీయలు వద్దన్నారు. ఈసందర్భంగా బాధిత కుటుంబాల సభ్యులు తమకు ఎక్స్‌గ్రేషియాతో పాటు జీవనాధారంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను వేడుకున్నారు. అజ్మీర మంగు కుమారులు గణేష్, ఉమేష్ తమకు అవకాశం కల్పించాలన్నారు. గణేష్ ఐటీఐ పూర్తి చేయగా, ఉమేష్ 10 తరగతి చదివామని తెలిపారు. దీనిపై స్పందించిన వారు ఐటీఐ పూర్తి చేసిన గణేష్ కు ఉద్యోగ కల్పనపై హామీ ఇచ్చారు. వీరి వెంట ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్, రైతు బంధు కమిటీ సభ్యులు ఉన్నం వీరేందర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సర్పంచ్ మాలోత్ కిషోర్, బీఆర్ఎస్ నాయకులు ముత్యాల వెంకటప్పారావు, అజ్మీర వీరన్న, అడపా పుల్లారావు, శివరాత్రి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.