Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలో వంకాయలపాటి వీరయ్య చౌదరి 24వ వర్ధంతి ఖమ్మం వివిసి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిసి, విఆర్ఏ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వివిసి, విఆర్ఏ గ్రూప్ తెలంగాణాలో నెంబర్ వన్ స్థాయికి రావడానికి నాన్న మంచితనం, నిబద్ధత అన్నిటికి మించి కస్టమర్‌కు మా సంస్థపై నమ్మకం అని అన్నారు. ఆనాటి నుండి మేము మా నాన్న ఆశయాలను అమలు పరుస్తూ ప్రజలకు, సమాజానికి మా వివిసి, వివిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అని అన్నారు. ఖమ్మం ప్రజలకు ఏ అవసరం వచ్చినా మా వివిసి అండ్ వివిఆర్ ట్రస్ట్ ద్వారా ముందు ఉంటామని, అలాగే నాగులవంచ గ్రామానికి ఉచితంగా వైకుంఠ రధం, ఫ్రిడ్జ్ బాక్స్ ను కూడా ఇస్తున్నామని చెప్పారు. అలాగే నాగులవంచ గ్రామం ముఖ్య కూడళ్ల సి సి కెమెరాలు మా వివిసి అండ్ వివిఆర్ ట్రస్ట్ ద్వారా మా స్వంత ఖర్చుతో అమరుస్తున్నామని, ఇది ఈ నెల ఆఖరు కి పూర్తి అవుతుంది అని అన్నారు. ఇప్పటికే మా వివిసి అండ్ వివిఆర్ ట్రస్ట్ ద్వారా ఖమ్మంలో రెండు సర్కిల్స్ అభివృద్ధి చేశామని, త్వరలో కూసుమంచి, నేలకొండపల్లి సర్కిల్లో కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ఖమ్మం, హైదరాబాద్ బాచుపల్లి లో తాము త్వరలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం మొదలుపెడుతన్నామన్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ట్రైనింగ్ అయి తెలంగాణాలో ఉన్న మా వివిసి అండ్ విఆర్ఏ గ్రూపులో ఉద్యోగాలు పొందవచ్చు అని అన్నారు. ఈ ట్రైనింగ్ ఉచితం గా ఇవ్వబడుతుంది అని అన్నారు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న మా సంస్థలలో సంప్రదించవచ్చని చెప్పారు. నాన్న వర్ధంతి సందర్భంగా ఖమ్మం లో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజినకు సుమారు 16 లక్షల వ్యయం గల అంబులెన్సును మా వివిసి అండ్ వివిఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని అత్యాధునిక హంగులతో, ఖమ్మం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకి అందజేశారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రోగుల కోసం రాజేంద్రప్రసాద్ అడగకుండానే అంబులెన్సును మెడికల్ కాలేజ్‌కి ఇవ్వ డం ఎంతో అనంద దాయకమని అని అన్నారు. ఈ కార్యక్రమములో వివిసి అండ్ వివిఆర్ ట్రస్ట్ చైర్మన్ వంకాయలపాటి ద్రౌపతి , సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.