Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడించకుంటే ప్రజా జీవనం అస్తవ్యస్తం
- సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు భాగం
- బీజేపీని గద్దె దించడమే ప్రజల తక్షణ కర్తవ్యం
లేకుంటే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
- సత్తుపల్లి నుంచి ప్రారంభమైన సీపీఐ ప్రజాపోరు యాత్ర
నవతెలంగాణ-సత్తుపల్లి
దేశ ప్రజలకు బీజేపీతో పెనుముప్పు పొంచి ఉందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు బాగం హేమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దె దించకుంటే దేశ ప్రజల జీవన స్థితిగతులు అస్తవ్యస్తమవుతాయన్నారు. బీజేపీ హటావో దేశ్కి బచావో నినాదంతో సీపీఐ తలపెట్టి ఖమ్మం జిల్లా ప్రజాపోరు యాత్ర శుక్రవారం సత్తుపల్లిలో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో జరిగిన సభలో బాగం మాట్లాడారు. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతమవుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ 9 యేండ్ల కాలంలో ప్రధాని మోడీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నడిబజారులో కారుచౌకగా అమ్మకానికి పెట్టారన్నారు. కుల, మతాల మధ్య విధ్వేషాలు సృష్టి లబ్ధిపొందాలనే దుష్ట సంప్రదాయానికి తెరలేపిందన్నారు. దేశంలో కాషాయదారుల దాడుల మితిమీరాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశప్రజలు సంఘటితం కావాలన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ పాలనను గద్దె దించడమే ప్రజలు ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. లేకుంటే దేశంలో అరాచకం రాజ్యమేలుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజల గోడతో పనిలేదన్నారు. కేవలం అదాని, అంబానీలకు ఊడిగం చేయడమే ప్రధాని మోడీ పరమావధిగా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, కర్షకులపై దయాదాక్ష్యిణ్యాలులేని రీతిలో కాషాయదారుల పాలన సాగుతోందన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మౌలానా, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మాచర్ల భారతి, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ దిండి సురేశ్, డివిజన్ కార్యదర్శి దండు ఆదినారాయణ, మండల కార్యదర్శి తడికమళ్ల యేబు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు పాల్గొన్నారు. సీపీఐ తలపెట్టిన పోరుయాత్రకు సంఘీభావంగా మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే రఫీ, అంకమరాజు పాల్గొన్నారు.