Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశభక్తి పేరుతో దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం రంగ సంస్థలను కారు చౌకగా కట్టబెడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర చర్ల మండలంలో ప్రారంభమై శుక్రవారం దుమ్ముగూడెం చేరుకుంది. పోరు యాత్ర బృందానికి సిపిఐ శ్రేణులు పర్ణశాల క్రాస్ రోడ్డు వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడ నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో లకీëనగరం చేరుకుంది. లకీëనగరం సెంటర్లో సిపిఐ మండల కార్యదర్శి రావులపల్లి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ... దేశ భక్తులుగా చలామని అవుతున్న బిజెపి పార్టీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్క చెమట చుక్క కూడా కార్చలేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు మోడీ పాలనకు చమరగీతం పాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేయాల్సి ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ది గెలుపుకోసం కమ్యూనిస్టులు ఐక్యంగా కలసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్, జిల్లా సమితి సభ్యులు కుంజా శ్రీనివాసరావు, కల్లూరి వెంకటేశ్వరావు మాజీ ఎంపి మిడియం బాబురావు, మర్మం చంద్రయ్య , రామిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.