Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్ల సాధనకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం
- ఈ నెల 17 నుండి నిరవదిక సమ్మె
- సీఐటీయూ పట్టణ కన్వినర్ కె.సత్య
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగ సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం నిరసన తెలిపి వీఓఏల సమస్యలపై అంబేద్కర్‌కు సీఐటీయూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ పట్టణ కన్వినర్ కె.సత్య మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత పలు డిమాండ్ల సాధనకై ఐకేపీ వీఓఏలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. చాలీచాలని జీతాలు రూ.3900 మాత్రమే ఇస్తూ గొడ్డు చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం దిగోచ్చేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఇప్పటికే మండల జిల్లా రాష్ట్ర అధికారులకు వినతిపత్రాలు శాంతియుత ఆందోళన నిర్వహిస్తున్నారని నేటికి ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న విమర్శించారు. వీఓఏల శ్రమను గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల విసిగి వేసారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కు తోచని పరిస్థితి వల్ల నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకుంటే ఉధ్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాములు విఓఏల పట్టణ అద్యక్షులు అనురాధ, కార్యదర్శి రమేశ్, కోశాధికారి రమాదేవి, ఉమా, రోజ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.