Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన మార్స్కిస్టు నేత
- నేడు 18వ వర్థంతి
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండలో సీపీఐ(ఎం) పార్టీ వ్యవస్థాపక ఉద్యమ నాయకులు, పార్టీ గ్రామ కార్యదర్శిగా పదేళ్ల ప్రస్థానం, కులమతాలకు అతీతంగా ఇండ్ల స్థలాలు పంపిణీ, ఆదర్శ కమ్యూనిస్టుగా, ఎంపీపీగా, ప్రజాసేవకే అంకితమైన, ఎర్రజెండా గడ్డలో పుట్టిన ముదిగొండ బిడ్డ పుచ్చకాయల వెంకటేశ్వర్లు 18వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
ముదిగొండ గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటేశ్వర్లు సామాన్య వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టారు. నూనూగు మీసాల వయసులోనే కష్టజీవుల కార్మికుల బాధలు చూసి ఆవేదన చెంది, బాధలు పోయే మార్గాన్ని బతుకులు బాగుండే బాట కావాలంటూ అన్వేషణ చేశారుఉ. ఆనాడు ఎర్రజెండా ద్వారానే పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నమ్మి నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నడిచి ఆచరించి ప్రజల పక్షాన పోరాడి విజేతగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు. పుచ్చకాయల వెంకటేశ్వర్లు ముదిగొండలో మార్క్సిస్ట్ పార్టీ వ్యవస్థాపక ఉద్యమ నాయకుల్లో ఒకరు. పార్టీ తొలి గ్రామ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పదేళ్ల వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ విస్తరణకు, నిర్మాణానికి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి అగ్రభాగాన నిలిచారు. పుచ్చకాయల వెంకటేశ్వర్లు రావెళ్ళ సత్యం రాయల వెంకటేశ్వర్లు స్పూర్తితో గ్రామంలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపి ప్రజల్లో ఆదరాభిమానాలు పొందిన గొప్ప వ్యక్తి పుచ్చకాయల. మార్క్సిస్టు పార్టీ అడ్డా ముదిగొండ గడ్డ ఎర్రజండా రెపరెపలు పేదప్రజల గుండెల నిండా అని పార్టీ ప్రగతి రథచక్రాలు దోపిడీదారుల దౌర్జన్య అరాచకవాదుల ఆటలు సాగవుఅంటూ శాసనంగా నిలిచాయి. ఎర్రజండాకు మరింత వన్నె తెచ్చిన పుచ్చకాయల వెంకటేశ్వర్లు ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీచేసి అఖండ మెజార్టీతో గెలిచి 1995 నుండి 2000 వరకు ఎంపీపీగా మండల ప్రజలకు అనేక సేవలందించారు. ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు ముదిగొండ గ్రామంలో ఇళ్లస్థలాల కోసం ఉద్యమించి స్థలాలను సాధించారు. రాజకీయాలకలు, కులమతాలకు అతీతంగా 350 ప్లాట్లను ప్రజలకు పంచి పెట్టిన ఘనత పుచ్చకాయల వెంకటేశ్వర్లుకె దక్కింది.
తాను ప్రజా ప్రతినిధిగా పనిచేసిన క్రమంలో సాదాసీదాగా క్రమశిక్షణతో పార్టీ నిబద్ధతతో నిరాండబరుడుగా నిర్మలమైన జీవితాన్ని గడిపారు. ఆయన స్ఫూర్తితోనే గ్రామంలోనే మందరపు వెంకన్న, మాదాల వెంకయ్య, ఇరుకు వెంకయ్య ఎర్రజెండా పట్టి పార్టీలో పని చేశారు మాదాల వెంకయ్య, ఇరుకు వెంకయ్యలు మృతి చెందారు. పుచ్చకాయల వెంకటేశ్వర్లుతో ఆనాడు పార్టీలో కలిసి పనిచేసిన మందరపు వెంకన్న ఆయన స్ఫూర్తితోనే నేటికీ పార్టీలో కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లు పార్టీలో పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదురైనా తనసొంత భూములను అమ్ముకొని తొలగించుకున్నారు. అంతటి గొప్ప మహానాయకుడు ఆదర్శ విప్లవ కమ్యూనిస్టువాదికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పుచ్చకాయల వెంకటేశ్వర్లు స్వతహాగా సర్వేయర్ ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కుమారుడు అచ్యుతరావు పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటి గొప్ప విలువలు వ్యక్తిత్వం ఉన్న పుచ్చకాయల వెంకటేశ్వర్లును మాయదారి రోగం వెంట పడటంతో వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురై 2005 ఏప్రిల్15వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆనాడు ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేని ప్రజానీకం ఆయన అంతిమయాత్రలో కన్నీటి సంద్రం కొనసాగింది. ఆయన మరణించి నేటికి దశాబ్దంన్నర అయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ప్రజల గుండెల్లో మారుమోగుతూ గ్రామం నడిబొడ్డున స్తూపమై వెలుగుతున్నారు.