Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిలభారత షెడ్యూల్డ్ కులాల,షెడ్యూల్డ్ జాతుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీఎం రోడ్డులోగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అద్యక్షులు కాల్వ ప్రకాశరావు, కాల్వ దేవదాసు, కాల్వ భాస్కర్, రాజేంద్రకుమార్, దాసరి నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాలశ్రీనివాసరావు, ఎస్విఆర్కే ఆచార్యులు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, జిల్లా ఐద్వా నాయకురావు ఎం.జ్యోతి, సత్య, ఎడవల్లి కృష్ణ, నూకల రంగారావు తదితరులు పాల్గొనగా ఉపకులాల ఉద్యోగస్తుల సంఘం జాతీయ మాలమహానాడు సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూర్గుల విజయభాస్కర్, జాతీయ మాలమహానాడు కార్యదర్శి తుప్పుడు శివకుమార్, ఉప్పెన కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీఎస్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కేటిపిఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ఎస్సీలు డిఈలు ఉద్యోగ కార్మిక మహిళా ఉద్యోగులు ఐఖ్యవేదిక సభ్యులు కూరపాటి రమేశ్, తిప్పారపు రమేశ్, పాల్గొన్నారు. హెచ్ 142 ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి రామారావు, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసాచారి, బి.సత్యరాజ్స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్ పాల్గొన్నారు. దంతెల బోర ఎస్సీ కాలనీ గ్రామపంచాయితీలో అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గద్దల రమేశ్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులు చాట్ల శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిఎస్పి ఆధ్వర్యంలో పాల్వంచలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణాద్యక్షులు కొల్లపూడి ప్రవీణ్‌కుమార్, కోలా మల్లిక, కేతిని కుమారీ, రాజేశ్వరి, సరోజ, మర్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు గత తొమ్మిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాజిక న్యాయాన్ని ప్రభుత్వ రంగాన్ని సమాధి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నదని, అన్ని తరగతుల ప్రజలకు హాని కరంగా మారిన బీజేపీని ఇంటికి సాగనంపడట మే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇచ్చే ఘనమైన నివాళి ఆని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ అన్నారు. సారపాకలోని ఐటీసీ బీపీఎల్ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా అధ్యక్షతన డాక్టర్ అంబేడ్కర్ 132వ జయంతి సభలో ఏ.జే.రమేష్ మాట్లాడారు. బాల్య దశ నుంచి అంబేద్కర్ అనేక రకాల అవమానాలకు, వివక్షతకు గురై అనేక బాధలు అనుభవించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఉండి భారత దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభ్యం కావాలంటే ప్రభుత్వ రంగం ఏర్పాటు ఒక్కటే పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్‌ని దేశంలో మాత్రమే కాక, ప్రపంచం యావత్తు ప్రజలంతా గౌరవించే గొప్ప సామాజిక విప్లవకారుడని ఆయన అన్నారు. గెట్ మీటింగ్ సందర్భంగా తొలుత ఎ.జె.రమేష్, వెంకటేశ్వర్లులు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య, ఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు చుక్కయ్య, రాములు, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సారపాక పార్టీ కార్యాలయంలో...
సారపాక సీపీఐ(ఎం) కార్యాలయంలో కనకం వెంకటేశ్వర్లు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బతికించాలన్న కాపాడుకోవాలన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని లౌకిక పార్టీలు కలిసి ఓడించాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయల వెంకటేశ్వర్లు, బర్ల తిరపతయ్య, యార్రంకి అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో..
మాహా మేథావి అంబెడ్కర్ అని సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య అన్నారు. మండలంలోని మోతె గామంలో యువకులు, సీఐటీయూ మండల కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల నాయకులు రాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కషి చేద్దాం : జడ్పీటీసీ
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరు కృషి చేద్దామని జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మండలంలో పలు పంచాయతీలలో జయంతి వేడుకలలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ముత్యాలమ్మ, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘ నాయకులు, మండల నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు జయంతి వేడుకలు..
బూర్గంపాడులో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదిన మహౌత్సవ వేడుకలలో మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీ, పాండవ బస్తి నుండి పెద్ద ఎత్తున యువతీ, యువకులు, పెద్దలు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొని ఘనంగా పర్వదిన వేడుకను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు కే.వి.రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కే.వి.రమణ, గాడిద దామోదర్, గాడిద ఈశ్వర్, నరహరి, రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు సుబ్రహ్మణ్యం, నాగరాజు, లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు నాగరాజు, బర్ల నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీటీసీ ముడ్ గణేష్, అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, నరేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : అంబేద్కర్ జయంతి సంధర్భంగా ఇల్లందు మండల, టౌన్ ప్రాంతాలలో కొత్త బస్టాండ్, బిల్డింగ్ వర్కర్స్ అడ్డా, 14 నంబర్ బస్తి, సంజరు నగర్, రాజీవ్ నగర్, వినోబా భావే కాలనీ ఏరియాలలో సీఐటీయూ, కేవీపీఎస్, ఐద్వా, వ్యకాస, ఆవాజ్ సంఘాల అధ్వర్యంలో కొత్త బస్టాండ్ నందు జయంతి వేడుకలు నిర్వహించారు. పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. సహపంక్తి భోజనాలు నిర్వహించారు. మండల ప్రజాసంఘాల నేతలు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, వెంకటమ్మ, మోహన్ రావు, సంధ్య, ఎస్కే ఖాదర్‌లు మాట్లాడారు.
ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో : ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ జె.ముఖేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ మామిడి సత్య ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ నాయక్, జాయింట్ సెక్రెటరీ కీర్తి కార్తిక్, ట్రెజరర్ కే.ఉమామహేశ్వరరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ప్రసంగించారు.
జీఎం ఆధ్వర్యంలో : జెకె కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలను ముఖ్య అతిధి ఏరియా జీఎం ఎం.షాలెంరాజు పాల్గొనారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. తదుపరి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జెకె బస్ స్టాప్ వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్‌ని కట్ చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో : మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు : కేంద్ర ప్రభుత్వా విధానాన్ని వ్యతిరేకించడమే అంబేద్కర్‌కు నిజమైన నివ్వాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మడి నరసింహారావు, ఎం.లక్ష్మణరావు, రాజు, తోట పద్మ, వై.నాగలక్ష్మి, వీరన్న, గిరిజన నాయకురాలు, సీఐటీయూ సీనియర్ నాయకులు ఎస్.వెంకట్రావు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో : పివీ కాలనీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు బ్రాంచ్ కార్యదర్శి వల్లూరి వెంకటరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో (సిఐటియూ) కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు, నంద, ఈశ్వరరావు, విల్సన్ రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద : మణుగూరు సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు భాగంగా ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఉప్పతల నరసింహారావు, మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కోశాధికారి టి.కృష్ణయ్య, ఎస్ఎంఎస్ ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు.
బీటీపీఎస్‌లో : బీటీపీఎస్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఈ బిచ్చన్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ బి.పార్వతి, టి.శ్రీనివాసరావు, డబ్ల్యూ రమేష్ బాబు, ఎస్.వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, బి.శ్రీనివాసరావు, డీఈ సెప్టీ జి.ఆనంద్, ప్రసాద్, కార్మిక సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ నాగేశ్వరావు, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ భీరం సుధాకర్ రెడ్డి, అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రామూర్తి, నాగరాజు, ప్రసాద్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అఖిలపక్ష రాజకీయ నాయకులు, దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ములకలపల్లి : అంబేద్కర్ జయంతిని మండల కేంద్రంలోని వ్యకాస, సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు, సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు పోడియం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, బిబినేని శివ, దినేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. అదేవిధంగా దేశంలో అమల్లోకి వస్తున్న నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బి.మురళిమోహన్, జిల్లా కోశాధికారి ఎస్.వి.జిల్లా కార్యదర్శులు ఎం.పద్మరాణి, డి.దాస్, ఎస్.శైలజ, జిల్లా కమిటీ సభ్యులు తేజవత్ బాలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భారతరత్న అంబేద్కర్ అందరివాడు
అంబేద్కర్ అందరివాడని భద్రాచలం జీసీసీ డివిజన్ మేనేజర్ విజరు కుమార్ అన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జీసీసీ భద్రాచలం మేనేజర్ దావీదు, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు అలవాల రాజా పెరియర్, ప్రముఖ అంబేడ్కరిస్ట్ ఈటే రాజేశ్వరరావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు భీంపాక పెదరాజు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవికుమార్, దళిత విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో అన్నదానం
అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సరోజినీ వృద్ధాశ్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. 200 మంది వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసింహారావు, సరెళ్ళ వెంకటేష్, సీపీఐ(ఎం) పార్టీ డివిజన్ నాయకులు ఎంబి నర్సారెడ్డి, కారుమంచి సతీష్, కనకరాజు, జయరాజు, యేసు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో ప్రధాన సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ పద్మ, ఎంపీపీ లలిత, ఎస్సై షాహిన పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటరామకృష్ణ అనే బాలుడు పోలీస్ డ్రస్ వేసుకొని సబ్ ఇన్స్పెక్టర్తో కలసి అంబేద్కర్‌కి పులా మాల వేయడంతో బాలుడు ఆకర్షణీ యంగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, చల్లా రమేష్, రాంబాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
పినపాక : మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, పంచాయతీల ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్లో మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు స్థానిక ఎస్సై నాగుల్ మీరా ఖాన్ హాజరయ్యారు. ఉప్పాకలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. 23 గ్రామపంచాయతీ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
జూలూరుపాడు : స్థానిక వెంకన్నపాలెం శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాస నరేష్ హాజరై మాట్లాడారు. వెంకటి లక్ష్మయ్య, అభిమిత్ర, పవన్, నవదీప్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.