Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ
- అంబేద్కర్ జయంతి సభలో పోతినేని
నవతెలంగాణ- ఖమ్మం
హిందూ రాష్ట్రం ఏర్పడితే దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు అని అంబేద్కర్ ఆనాడే చెప్పారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా జడ్పి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఫాసిస్టు సిద్ధాంతమని, వారి లక్ష్యం విభజన వాదం, హిందూ రాజ్యస్థాపన, ఏక సంస్కతి, మధ్య యుగాల నాటి విధానాల పునరుద్ధరణ అని అన్నారు. బీజేపీ కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని లౌకిక విలువలకు తూట్లు పొడిచి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తుందని పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఓట్లకోసం, సీట్లకోసం అంబేద్కర్‌ను తనవాడంటూ బీజేపీ స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తూ, ప్రజల్ని నమ్మించడానికి నాటకాలాడుతున్నదన్నారు. అంబేద్కర్ ఆశయాలను సమాధి చేస్తున్న ఆర్ఎస్ఎస్, మతోన్మాద బీజేపీ విధానాలను ప్రతిఘటించేందుకుత పోరాటాలను ఉధృతం చేయాలని, అందుకు సామాజిక - వర్గ పోరాటాలను మమేకం చేయాలని, అదే అంబేద్కర్‌కి మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటీ సరళ, వై.విక్రం, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, యస్.నవీన్‌రెడ్డి, దొంగల తిరుపతిరావు, ఆర్.ప్రకాష్, పి.రమ్య, బోడపట్ల సుదర్శన్, నాయకులు కాంపాటి వెంకన్న, కొమ్ము శ్రీను, వెంకన్న బాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విష్ణు వర్ధన్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై. విక్రం, ఉపాధ్యక్షురాలు పి రమ్య ,జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం అమరయ్య, నాయకులు కాసిం, నరసయ్య, సైదులు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు మురళి, పవన్ ,వీరన్న, ప్రసాదు ,రాములు ,కష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఖమ్మంలోని 57 వ డివిజన్ జర్నలిస్ట్ కలని లో మరియు జడ్పీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి కెవిపిఎస్ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ బర్త్‌డే కేకు కట్ చేసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్ అధ్యక్షతన జరిగిన జయంతి కాయక్రమంలోమనోహర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీనివాసరావు, నకరికంటి చిరంజీవి, సైదులు, మాగి భద్రయ్య, గుమ్మడి బిక్షం, మర్రి బాబురావు, శాంతయ్య, ఐద్వా టూ టౌన్ అధ్యక్షురాలు నందిపాటి పావని, మర్రి శ్రీదేవి, యాస్మిన్ నాయకులు గుమ్మడి శేఖర్, మీసాల జానయ్య, గురిగందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక విజ్ఞాన్ స్కూల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపూడి సీతారాములు, కరస్పాండెంట్ జయప్రకాష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలొ వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత, స్పోకెన్ ఇంగ్లీష్ భాస్కర్, స్కూల్ యాజమాన్యం మంజుల, విద్యార్థులు, ఉపాద్యాయ బందం, తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నా బిజెపిని గద్దె దించటమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా పాత బస్టాండ్ సెంటరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, చింతనిప్పు చలపతిరావు, బొంతు సమత, హరి వెంకటేశ్వరరావు, అనుమోలు రామారావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, గుమ్మా నరసింహారావు, బెజవాడ వీరభద్రం, మాడపాటి రామారావు సంక్రాంతి పురుషోత్తంరావు, పాపగంటి రాంబాబు, ఓర్పు సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజరు కుమార్, డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలో పత్తి మార్కెట్ లో ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బండారు యాకయ్య, పార్టీ త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు వజెనేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, ఎస్ కే సైదులు, శీలం వీరబాబు, సిఐటియు త్రి టౌన్ కార్యదర్శి ఎర్ర మల్లికార్జున్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బోనకల్ : సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ముదిగొండ : బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతితో పాటు,ఉస్మానియా యూనివర్సిటీ పిడిఎస్యు నాయకులు, అమరుడు జార్జిరెడ్డి వర్ధంతి వేడుకలను సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో చిరుమర్రి, ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల నాయకులు బట్టు రాజు, చిరుమర్రి ఎంపీటీసీ సభ్యులు కోలేటి అరుణ,సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు మందరపు వెంకన్న,నెమిలి సైదులు,రైతు సంఘం మండల కార్యదర్శి కోలేటి ఉపేందర్,సిపిఐ (ఎం) వెంకటాపురం, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మెట్టెల సతీష్,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు పురిమెట్ల సాయిరాం పాల్గొన్నారు.
మధిర: మధిర అంబేద్కర్ రింగ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం జిల్లా నాయకులు శీలం నరసింహారావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మధిర పట్టణ కమిటీ సభ్యులు తేలపోలు రాధాకృష్ణ, పడకండి మురళి, పల్లికంటి విల్సన్, పల్లపు గోపి, పంతంగి నాగయ్య,, మధిర మండల కార్యదర్శి మందా సైదులు, కమిటీ సభ్యులు మద్దాల ప్రభాకర్, నాయుడు శ్రీరాములు, కుక్క మోహన్ రావు, వడ్రాన్నపు మధు, పట్టణ మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.