Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు ఆర్ధికసాయం
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం చీమలపాడులో 12వ తేదిన జరిగిన ఆత్మీయ సమ్మేళనం సంధర్బంగా పేలిన గ్యాస్ బండ బాధిత కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ శుక్రవారం పరామర్శించి భరోసా కల్పించారు. చీమలపాడు కు చెందిన అజ్మీర మంగు, స్టేషన్ చీమలపాడు కు చెందిన బానోత్ రమేష్, గేటురేలకాయలపల్లికి చెందిన ధర్మసోత్ లక్ష్మన్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కలిసి వారిని ఓదార్చారు. కుటుంబానికి రూ.50వేలు చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. తవిసిబోడుకు చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజావత్ భాస్కర్ కుటుంబానికి రూ.25వేలు అందజేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చీమలపాడు ఘటన దిగ్భాంతిని కల్గించిందన్నారు. కార్యకర్తలను కోల్పోవటం బాధకల్గించిందన్నారు. విషాధకరణ ఘటన బాధితులకు ప్రతి ఒక్కరు ధైర్యం చెప్పి అండగా ఉండాలని కోరారు. ప్రబుత్వం అన్ని విధాలా ఆదుకోవటానికి ముందు వచ్చి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుందన్నారు. వైద్యం ఎలాంటి అలసత్వం లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజరుకుమార్, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధులు నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు. బాధితుల డిమాండ్లను పెద్దల దృష్టికి తీసుకవెళ్ళి అమలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మాణిక్యారంలో అనోరోగ్యంతో మృతి చెందిన దారావత్ సక్రు కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలు ఆర్ధిక సాయం అందజేశారు. కారేపల్లిలో అంబేద్కర్ జయంతిలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్, సర్పంచ్ భూక్యా రమణ, ఎంపీటీసీ ధర్మసోత్ శంకర్, రైతుబంధు మండల మాజీ కన్వీనర్ హన్మకొండ రమేష్, జామే మసీద్ అధ్యక్షులు ఎస్కె.గౌసుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.