Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మిషన్ భగీరధ పధకం మండలంలో అటకెక్కుతోందని సీపీఐ(ఎంఎల్) ప్రజా పంధా మండల కార్యదర్శి సాయన్న అన్నారు. మండలంలో పలు చోట్ల మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసినప్పటికి అవి అలంకారప్రాయంగా ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు పడుతున్న మంచినీటి సమస్య పై తాము సర్వే నిర్వహించగా చాలా గ్రామాలలో ప్రజలు గొంతు తడుపుకునేందుకు మంచినీరు దొరకడం లేదంటూ ఆయన తెలిపారు. అవజుబాక, సింగవరం గ్రామాలతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకుల్లోకి నీరు రావడం లేదన్నారు. సర్వే నిర్వహించిన వారిలో నాయకులు సున్నం వీరభద్రం, మిడియం శంకర్, నారాయణ తదితరులు ఉన్నారు.