Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ కె. రఘునాథ్
నవతెలంగాణ-సుజాతనగర్
కాసాని లక్ష్మి మెడికల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయటం తన అదృష్టం అని డాక్టర్ కె.రఘునాథ్ అన్నారు. మండల పరిధిలోని స్థానిక చింతలపూడి సత్యం భవన్లో ఏర్పాటు చేసిన కాసాని లక్ష్మి మెడికల్ ట్రస్ట్ ఏడాది పూర్తయిన సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ట్రస్టు ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. నేటి సమాజంలో ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించాలని అన్నారు. షుగర్, బీపీ వంటి వ్యాధులు ప్రాణాంతకమైనవి కాకపోయినప్పటికీ వాటిపై ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో సమతుల్యతను పాటించాలని తెలిపారు. ప్రతి నెల వచ్చేవారు చుట్టూ ప్రక్కల ఉన్నవారికి ట్రస్ట్ సేవలు తెలియపరచాలని అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ కాసాని లక్ష్మి ట్రస్ట్ పేరుతో అనేక సేవ కార్యక్రమాలు చేశామని ముఖ్యంగా కరోనా టైంలో మండల వ్యాప్తంగా నిత్యవసరాలు పంపిణీ కరోనా అంత్యక్రియలు, కరోనా పరీక్షలకు ఉదయం సమయంలో వచ్చే వారికి అల్పాహారం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. షుగర్, బీపీ వంటి వ్యాధులకు ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని అన్నారు. ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తే రూ.1500 నుంచి 2000 వరకు ఖర్చు చేయవలసి ఉంటుందని కాసాని లక్ష్మీ ట్రస్టు ద్వారా రూ.100కే ఓపీతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వీర్ల రమేష్, నల్లగోపు పుల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.