Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలోని సాజిదా మజీద్లో జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఈద్ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జమాతే ఇస్లామిక్ హింద్ వక్తలు మాట్లాడుతూ ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలగవ దని, జకాత్ అనగా ''శుద్ధి'', తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటిసి పీఎస్పీడీ(హెచ్ఆర్) శ్యామ్ కిరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ శ్రీనివాస్, ఐటీసీ ట్రేడ్ యూనియన్ నాయకులు కనకమేడల హరిప్రసాద్, యారం పిచ్చిరెడ్డి, గోనే రామారావు, గాదె రామ్ కోటిరెడ్డి, జమాతే ఇస్లా మిక్ హిందూ సారపాక పట్టణ కమిటీ అధ్యక్షులు జహీర్ పాషా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.