Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచల వాసి ఉద్యాన శాఖలో అధికారిగా పనిచేసి గిరిజనులతో 5 లక్షల పై చిలుకు పండ్ల మొక్కలు నాటించి వారికి యాజమాన్య పద్ధతులు నేర్పించిన ఘనత డాక్టర్ గోళ్ళ భూపతిరావుకు దక్కుతుంది. వీరి సేవలను గుర్తించిన అధికారులు పలు అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. పదివి విరమణ తదుపరి వారి కున్న అనుభవంతో గ్రీన్ భద్రాద్రిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ కొన్ని వేలు మొక్కలు భద్రాచలంలో నాటించారు. ఇప్పుడు అవి వృక్షాలై పాదచారులుకు స్థానికులకు నీడను, ప్రాణవయువును అందిస్తున్నాయి. ఉద్యాన పార్క్‌ల ఏర్పాటు రైతుల పండ్లతోటలకు సలహాలు సూచనలు ఇస్తూ ఇంతటి బృహతర కార్యక్రమాలకు సారద్యం వహిస్తున్న డా.గోళ్ళ భూపతి రావుకు 40 పై చిలికు అవార్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించారు. పర్యావరణంలో వీరు చేస్తున్న కృషికి జాతీయ అవార్డు న్యూఢిల్లీ నుండి, పాండిచేరిను నుండి గౌరవ డాక్టరేట్‌ను గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుండి స్వీకరించారు. అంతే కాకుండా వీరు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ఇతర సంస్థలలో కూడా అమూల్యమైన సేవలందిస్తున్నారు. వీరి సేవాగుణాలను పరిగణలోకి తీసుకున్న వల్లూరి ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఆదివారం హరిహర కళా భవన్ సికింద్రాబాద్ నందు జరిగిన కార్యక్రమంలో అత్యంత ప్రతిష్టత్మకమైన 'బంగారు నంది అవార్డు'ను డా.గోళ్ళ భూపతి రావుకు ముఖ్య అతిధులు మంత్రి సత్యవతి రాథోడ్, లక్ష్మి పార్వతి చైర్మన్, దైవజ్ఞ శర్మ, తేజవత్ నాయక్ ఏసీపీ, సినీ హీరో కిరణ్, శంకర్ కలెక్టర్, అధ్యక్షులు వల్లూరి శ్రీనివాస్ వారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్బంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొంటు భద్రాద్రిని హరిత భద్రాద్రిగా మారుస్తానని తెలియజేసారు.