Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోరాటం ఉధృతం చేస్తాం
- సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఎస్ని రద్దు చేసే వరకు టీఎస్ సీపిఎస్ఈయూ పోరాటం ఆగదని, సాధారణ ఎలక్షన్స్ లోపు తెలంగాణాలో సీపిఎస్ని రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోరాటం ఉదృతం చేస్తామని టీఎస్ సీపీఎస్ఈయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు తుక్కాని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో వేలాది మంది పెద్దఎత్తున సీపిఎస్ ఉద్యోగ, ఉపాద్యాయులతో పాత బస్ డిపో నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ ర్యాలీ నిర్వహంచారు. అనంతరం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మానవహారం చేయటం జరిగింది. అనంతరం జిల్లా జడ్పీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన సభలో పెన్షన్ ర్యాలీని ఉద్దేశించి టీఎస్ సీపిఎస్ఇయూ అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా విన్నపాలకే పరిమితమైన సీపిఎస్ రద్దు అంశాన్ని పెన్షన్ బిక్ష కాదు ఉద్యోగి హక్కు అని నినదించి 2016 నుంచి పోరుబాట పట్టి పోరాట బావుట ఎగర వేసింది టీఎస్ సీపిఎస్ఇయూఅని చెప్పారు. నాటి నుండి నేటి వరకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్ధతుతో అలుపెరుగని పోరాటం చేస్తూ శంఖారావం, సామూహిక సెలవు, ఆయుత ధర్మ దీక్ష, భిలాఫత్ దివాస్, జన జాతర, సత్యగ్రహ దీక్షల వంటి పోరాట రూపాన్ని అనుసరించి సీపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, చనిపోయిన కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ సాధించి పెట్టిన ఘనత టీఎస్ సీపిఎస్ఇయూదే అని చెప్పారు. ఇటివల కాలంలో దేశంలో పాత పెన్షన్ రద్దుకోసం జరిగిన పోరాటాలలో ఎన్ఎంఓపీఎస్ (నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం) పాత్ర మరువలేనిదని, ఎన్ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హౌదాలో స్థిత ప్రజ్ఞ నాయకత్వం వహించడం మనందరికి గర్వకారణమన్నారు. ఎన్ఎంఓపీఎస్ పోరటాల ఫలితంగా పంజాబ్, ఛత్తీస్ ఘడ్ హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖాండ్ లాంటి రాష్ట్రాలు సీపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్నన్ పునరుద్దరించాయి. రాబోయే సాధారణ ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్రం కూడా సీపీఎస్ని రద్దు చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని, బీఆర్ఎస్ పార్టీ విధానంగా సీపిఎస్ని రద్దు చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సీపిఎస్ని రద్దు చేస్తున్న రాష్ట్రాల పీఆర్ఎఎన్ నిధులు వెనక్కి ఇవ్వటం కుదరదని కేంద్ర ప్రభుత్వం, సీపిఎస్ని రద్దు చేస్తున్నా రాష్ట్రాలను బ్లాక్ మెయిల్ చేసే ధోరణిని మానుకోవాలని పీఆర్ఏఎన్ అకౌంట్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు,ఉద్యోగులకు వెనక్కి ఇచ్చే విధంగా పీఎఫ్ ఆర్డిఏ చట్టాన్ని కూడా సవరించాలని అన్నారు.
రాష్ట్రంలో 1.75 లక్షల సీపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో రాబోయే ఆగస్టు-23 వరకు టీఎస్ సీపిఎస్ఇయూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని దానిలో భాగంగా ఈ రోజు పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చి ద్వారా ప్రభుత్వపై వత్తిడి తెచ్చే విధంగా పోరాటం ఉంటుందని, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ పెన్షన్ కాన్స్టిటూషనల్ మార్చికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులైన పీఆర్టియూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర రావు, రవి, యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కిశోర్ సింగ్, ఎన్.కృష్ణలు, టిటిఎఫ్టిఎస్ అధ్యక్షుడు రామరావు, జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్, ఏటిఎఫ్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు రామారావు, జయబాబు, టిఎస్ టిటిఎఫ్ బాధ్యుడు శంకర్, ఏటిఏ బాధ్యులు బిజ్జా శ్రీనివాస్, టీపీటీఎఫ్ బాధ్యులు, రాజు, హరిలాల్ , టిఎస్ టిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రమేష్, టీఎస్ సీపిఎస్ఇయూ రాష్ట్ర పరిశీలకులు రామగోపి, రాష్ట్ర కార్యదర్శి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ శేఖర్, జిల్లా సెక్రెటరీలు శ్రీనివాస్, భట్టు శ్రీవాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు నాగు నాయక్, పూర్ణలు, జిల్లా సెక్రటరీ అగ్గి రవి, లక్ష్మణ్, 23 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.