Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంతనే గోదావరి తాగేందుకు గుక్కడి నీరు లేకపాయే
- పేరుకే మిషన్ భగీరథ...కోట్లాది రూపాయలు మృధా
- ఎమ్మెల్యే సొంత గ్రామాలలో నీళ్లు కరువు
- సింగరేణిలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మండిపడుతున్న ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
చెంతనే గోదావరి అయినా చుక్క నీరేది. నాడు చలమలను తీసి మైళ్ళ దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని బాధపడమే కానీ తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన మిషన్ భగీరథ పథకం పేరుకే మంచినీటి పథకంగా మారిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆచరణలో అమలుకు సాధ్యం కానీ విధంగా మిషన్ భగీరథ ఉందనేది ప్రజల వాదన. చుట్టూ గోదావరి ప్రవాహం ఉన్నా తాగేందుకు చుక్క నీరు లేక గొంతెండుతుందని ప్రజలు లబోదిబోమంటున్నారు. తాగునీరు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో మంచినీటి సరఫరా సరిగ్గా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరో పక్క మంచినీటిని సరఫరా చేసేందుకు నిర్మించిన వాటర్ ట్యాంకులోనికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఉండడంతో వచ్చే నీటి సరఫరా అంత మాత్రంగానే జరుగుతుందని ప్రజలు గుసగుసల ఆడుతున్నారు. పలు గ్రామాలతో పాటు ఆదివాసి గ్రామాలలో ఆదివాసులు మంచినీటి కోసం నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
ఎమ్మెల్యే సొంత గ్రామాలల్లోనూ నీటి కరువు
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత గ్రామమైన కరకగూడెంలో తాగేందుకు నీళ్లు రావడంలేదని మార్చి ఏప్రిల్ నెలలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో స్వయంగా ప్రస్తావిస్తూ సమస్యలకు పరిష్కారం ఎక్కడుందో అధికారులు కనిపెట్టలేకపో తున్నారని మండిపడ్డారు. ఈ స్థాయిలో మంచినీటి సమస్య ఉందంటే ఇక సమస్య ప్రజల పరిస్థితి ఏమిటంటే పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
వాటర్ ట్యాంకులకు ఎక్కని నీరు
మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అయ్యే తాగునీరు కోట్ల రూపాయలతో నిర్మిం చిన వాటర్ ట్యాంకులకు సరఫరా ఎక్కడా లేద నేది ప్రధాన ఆరోపణ. మంచినీటి పథకం ద్వారా సరఫ రా అయ్యే నీరు ట్యాంకులకు ఎక్కకపోతే ఆ వాటర్ ట్యాంక్ పరిధిలోని గ్రామాల ప్రజలకు తాగునీరు ఎలా అందుతుంద ని పలువురు మంచినీటి సమస్యలపై పెదవి విరుస్తున్నారు.
సింగరేణి గనులతో అడుగంటుతున్న భూగర్భ జలాలు
గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పాటు అసలే గుక్కెడు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో సమస్య వేధిస్తుంది. మణుగూరు పరిసర గ్రామాలలో సింగరేణి గనులు కారణంగా సహజ నీటి వనరులు వాటికి అవసరం కావడంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని వాడుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పో తున్నాయి అనేది బహిరంగ సత్యమే. మూలికే నక్కపై తాటి పండు పడినట్లుగా అసలే తాగేందుకు ఇబ్బందులు పడు తున్న ప్రజలకు సింగరేణి పరిశ్రమలు కారణంగా పూర్తిగా నీటి కరువు ఏర్పడిందని మండిపడుతున్నారు. ఏదేమైనా సంబంధిత మిషన్ భగీరథ అధికారులు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నీటి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, వేసవి సమీపించే నాటికి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని మణుగూరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు
పడేరు పంచాయతీలో మిషన్ భగీరథ నీళ్లు నామమాత్రంగానే వస్తున్నాయి. రోజుకు నాలుగు బిందెలు మించి రావడం లేదు. ఒక్కొక్కసారి ఒకటి రెండు బిందె లు మాత్రమే వస్తున్నాయి. వాగు వడ్డు గుంపులో మిషన్ భగీరథ పంపు కనెక్షన్లు ఇవ్వలేదు. లోడిగోళ్ళ గుంపు, కింద గుంపు, వాగుడు గుంపు తదితర ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థ పడుతున్నాం. నీళ్ల కోసం వాగులు, వంక లు, బావులు ఉన్న ఇంటికి నీళ్ల కోసం వెళ్లడం జరుగుతుంది. ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
- పగడేరు గ్రామస్తురాలు కుంజా సామ్రాజ్యం
అధికారులు, సర్పంచ్‌లకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు
సమితి సింగారం పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ నీళ్లు రోజు విడిచి రోజు వస్తున్నాయి. అవి కూడా చాలకుండా వస్తున్నా యి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డి నెహ్రూ బజార్, జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో మిషన్ భగీరథ నీళ్లు పూర్తిగా రావడం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ట్యాంక్ నుండి నీళ్లు సరిగా రావడం లేదు. ఈ విషయంపై అధికారులకు సర్పంచ్‌కి ఎన్ని సార్లు చెప్పినా, దరఖాస్తులు చేసిన ఫలితం లేదు. మండల వ్యాప్తంగా మెషిన్ భగీరథ నీళ్లు రాక అనేక గ్రామాలలో తీవ్ర ఇబ్బందులు ఉన్నవి. వెంటనే వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూడాలి, సాంకేతిక సమస్యలు పరిష్కరించి నీళ్లదించాలి.
- ఐద్వా మండల కార్యదర్శి వై.నాగలక్ష్మి