Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా.. నిధులు మంజూరైతే మరమ్మతులు ఏవి అంటూ నవతెలంగాణ పత్రికతో పాటు వివిద పత్రికల్లో ప్రచురించిన కలం కార్మికుల కథనాలకు ఆర్Êబి అధికారులు స్పందించారు. గోదావరి వరదల సమయంలో నర్సాపురం నుండి తూరుబాక బ్రిడ్జి వరక చర్ల, భద్రాచలం వెళ్లే ప్రదాన రహదారి పలు చోట్ల గోతుల మయంగా మారడంతో పాటు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటన పై ప్రభుత్వానికి, ప్రజలకు ఫోర్త్ ఫిల్లర్గా ఉన్నటువంటి పలు పత్రికలకు చెందిన మండల విలేకరులు వరుస కధనాలు ప్రచురించిన సంఘటన పాఠకులకు సైతం విదితమే. కాగా నిధులు మంజూరైతే మరమ్మతులు ఏవి అనే నవతెలంగాణ కధనానికి అధికారులు స్పందించడంతో పాటు ఆదివారం గోతుల మయంగా మారిన రహదారికి మరమ్మత్తులు బిటి పనులు చేపట్టారు.
అధికారులు స్పందించారు : కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కనుబుద్ది దేవా
నిధులు మంజూరైతే మరమ్మతులు ఏవి అనే కధనం ఈ నెల 10వ తేదీన నవతెలంగాణ పత్రికలో ప్రచురించడం జరిగిం దన్నారు. దీని పై తాను డీఈ హరిలాల్తో పోన్లో మాట్లాడటం జరిగిందన్నారు. నిధులు మంజూరు అయ్యాయని కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నాడని రెండు మూడు రోజుల్లో పనులు చేపడతామని తనకు డీఈ తెలిపినట్లు ఆయన తెలిపారు. పత్రికలలో వచ్చిన కధనాలతో రహదారి పనులకు మోక్షం కలగడం అభినందనీయమన్నారు.